కులమతాలకు అతీతంగా అభివృద్ధి

ముఖ్యమంత్రికి మైనార్టీల ధన్యవాదాలు

మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాష ఆధ్వర్యంలో ఘన సన్మానం 

చైర్మన్ ను సన్మానిస్తున్న మార్కెట్ యార్డు చైర్మన్ ఇషాక్ బాష 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ లోని ఓ పాఠశాలలో మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇషాక్ బాష ఆధ్వర్యంలో చైర్మెన్ తో పాటు 11 మంది మైనార్టీ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇషాక్ బాష మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమన్నారు.
నంద్యాల పట్టణంలో మైనార్టీల జనాభా 80 వేలు ఉందన్నారు. నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించడం మైనార్టీల్లోసంతోషం వ్యక్తమైందన్నారు. ప్రజలకు నవరత్నాలు అందడంతో ప్రజలు అందరినీ భారీ మెజారిటీతో గెలిపించారని ముఖ్యమంత్రికి మైనార్టీలందరు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఛైర్మెన్ మాబున్నిసా, కౌన్సిలర్లు సాధిక్, సమ్మద్, తబ్రేజ్, ఆరిఫ్ నాయక్, కలాం, తోహిద్, అబ్దుల్ మజీద్, తమిమ్, షెహనాజ్, బాసిద్, షేక్ సంజీదాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు కౌన్సిలర్లు, ఛైర్మెన్ మాబున్నిసా దంపతులను ఘనంగా  సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు డిఎస్ హబీబుల్లా, చాంద్, పైలట్, వహాబ్ తదితరులు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: