మళ్ళీ క్రికెట్ ఫీవర్ షురూ

బెట్టింగ్ జోరూ..అభిమానుల హోరు !!!...

త్వరలో ఐపిఎల్ షురూ

(జానోజాగో వెబ్ న్యూస్-స్పోర్ట్స్ ప్రతినిధి)

గతేడాది కరోనా ప్రభావం వల్ల అభిమానులకు, బెట్టింగ్ మాఫియాకు నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఫ్రాంచేజర్లు జట్టులను వేలం పాటలో సొంతం చేసుకున్న సంగతి విదితమే. దీంతో క్రీకెట్ ఫీవర్ పెరగనుందనడంలో సందేహం లేదు. పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేసి అభిమానులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లకను సైతం ఆయా రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషనులు సిద్దం చేస్తున్నాయి. దేశంలోని అన్ని క్రికెట్ స్టేడియం లను ముస్తాబు చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్,లకు చెందిన జట్లను కొనుగోలు చేసుకున్నారు.

ఆటగాళ్లను సైతం వేలం పాట ద్వారా కొనుగోలు చేసుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ మ్యాచ్లను నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత్ పర్యటనలో ఉంది. టీ 20 మ్యాచులు కొనసాగుతున్నాయి. ఇరుజట్ల మధ్య రెండో t 20 మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి t20 మ్యాచ్ లో భారత్  ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించి. 5-1 తేడాతో విజయం సాధించింది. గెలుపు ధీమాతో ఇంగ్లాండ్ జట్టు సభ్యులు బరిలోకి దిగనున్నారు. మరో వైపు భారత జట్టు స్వల్ప మార్పులతో గెలవాలనే పట్టుదలతో మైదానంలోకి అడుగుపెడుతోంది. గుజరాత్ లోని నరేంద్రమోడీ క్రికెట్ మైదానంలో నేటి మ్యాచ్ ఆడనున్నారు. కరోనా ప్రభావం వల్ల గతేడాది స్తబ్ధతగా ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం వల్ల క్రీడలకు అంతరాయం కలిగింది. చిన్న, పెద్ద, మహిళలు అన్న తేడాలేకుండా క్రికెట్ స్టేడియాలు అభిమానులతో సందడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ ల జోరుకు కళ్లెం వేసేందుకు పోలీసులు సైతం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులకు ఆనందం కలిగించేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.  అభిమానులు టీవీల ముందు అతుక్కుపోయి మ్యాచ్లను వీక్షిస్తారు. పబ్,క్లబ్ లు సైతం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: