కొవిడ్ వాక్సిన్ పై కలెక్టర్ సమీక్ష

హాజరైన మార్కాపురం డివిజన్ అధికార్లు

ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా. భాస్కర్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

మార్కాపురం పట్టణములోని డ్వాక్రా హాలు నందు కొవిడ్ వాక్సిన్ గురించి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మార్కాపూరం డివిజన్ లోని అన్ని మండలాల ఎమ్మార్వో , ఎంపీడీవో , మెడికల్ ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ వాక్సిన్ మండలాల వారీగా ఆయా అన్ని సచివాలయాల్లో 45 సంవత్సరాల మించి ఉన్న వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికీ వేయాలని అధికారులను ఆదేశించారు,

మార్కాపురం డివిజన్ ఆర్.డి.ఓ. ఎమ్ శేషిరెడ్డి

తగినన్ని కరోనా వాక్సిన్ డోస్ లను ఈ రోజు లోగా మెడికల్ ఆఫీసర్లు సంబంధిత అధికారుల నుంచి తీసుకోవాలని తెలిపారు, సినిమా హాళ్లు , షాపింగ్ మాల్లో పనిచేసే ప్రతి ఒక్కరి దగ్గరా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ ఉండాలని , ఆలా లేని వారిపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, కోవిడ్ వాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ విషయములో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు , ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీ ఎస్ చేతన్ , జిల్లా పరిషత్ సిఇవో కైలాస్ గిరిశ్వర్ , డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి ,ఆర్డీవో శేషి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్ 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్, బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: