రక్తదానం చేసి...మానవత్వం చాటుకొని

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శాంతి బాయి. సోమందేపల్లి వాస్తవ్యురాలు.రక్తదాన కేంద్రంలో రక్త హీనత కారణంగాఅత్యవసరంగా ఏబీ .పాజిటివ్ రక్తం అవసరమై ఇబ్బంది పడుతుంటే రక్త దాతలు ఆదుకొన్నారు.   టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానం సభ్యులు,  ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు విషయం తెలుపగా టిప్పు సుల్తాన్ రక్త దానసంఘం నాయకులు ఇస్మాయిల్ జబీఉల్లాఖాన్. ఏబీపాజిటివ్ రక్తదానం చేశారు.
అనంతరం డ్యూటీ డాక్టర్ అఫ్తాబ్ గారు రక్తదాత కు ప్రభుత్వ ప్రశంసాపత్రం తో సత్కరించారు. టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం అనునిత్యం అత్యవసర సమయాల్లో అన్ని వేళలా శస్త్ర చికిత్సలకు డెలివరీ కేసులకు ప్రాధాన్యత నిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించే ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఉమర్ ఫారూఖ్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ రక్త దాన సంఘం సభ్యులు.నాజిమ్.రియాజ్.షఫీ.బాబాజాన్.తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: