"వైష్ణవ జనుడవు నీవే అయితే"

జాతిపిత మహాత్మాగాంధీ ...ప్రార్థనాగీతం ఆవిష్కరణ!!

(జానోజాగో వెబ్ న్యూస్-కల్చరల్ ప్రతినిధి)

"వైష్ణవ జనుడవు నీవే అయితే"..జాతిపిత మహాత్మాగాంధీ..ప్రార్థనాగీతం ఆవిష్కరణ!! కార్యక్రమం జరిగింది. ఈ గీతానికి

గీత రచన: డాక్టర్ కమలా రామన్

సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణన్      

గానం: ఉన్నికృష్ణన్-ఉష 

     మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది. ఈ గీతాన్ని తెలుగులో రాసి విడుదల చేశారు శ్రీ వెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ కమలా రామన్.

     'ఆనంద్, గోదావరి, చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్ స్వర సారధ్యం వహించిన ఈ ప్రార్ధనాగీతానికి... ప్రముఖ గాయనీమణి ఉషతో కలిసి సుప్రసిద్ధ గాయకులు ఉన్నికృష్ణన్ గాత్రమందించారు. 

      హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో గీత రచయిత్రి-శ్రీవెంకట్ ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి కమలా రామన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వజ, బ్రిగేడియర్ వి.శ్రీనివాసరావు, దైవజ్ఞశర్మ, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు, ఆలిండియా డైరెక్టర్ ఉదయ్ శంకర్ అతిధులుగా పాల్గొని... కమలా రామన్ కృషిని ప్రశంసించారు.

    సంగీత దర్శకుడు కె.ఎమ్.రాధాకృష్ణన్, గాయని ఉష, శ్రీవెంకట్ ట్రస్ట్ ప్రతినిధులు సూర్య కమల, ప్రేమ్ చంద్, శివ దండపాణి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు!







  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: