కుటుంబ వ్యవస్థను కాపాడుకోకపోతే సమాజానికి ముప్పు

ముగిసిన కుటుంబ వారోత్సవాలు


మీ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటున్నారు?

మీ దాంపత్య జీవితం ఎలా ఉంది?

పిల్లల చదువులపై శ్రద్ధ చూపుతున్నారా? 

మీ బంధువులతో సంబంధాలు ఎలా ఉన్నాయ్?

ఇంటి పనుల్లో మీ భార్యకు తోడ్పడుతున్నారా?

సంపాదనను ఎలా ఖర్చుపెడుతున్నారు?

ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్నలివి. కుటుంబ వ్యవస్థను కాపాడేందుకు జమాఅతె ఇస్లామీహింద్ లేవనెత్తిన ప్రశ్నావళి ఇది. ‘పటిష్ట కుటుంబం-పటిష్ఠ సమాజం’ పేరుతో జమాఅతె ఇస్లామీహింద్ పది రోజులపాటు ప్రచార ఉద్యమాన్ని చేపట్టింది. ఫిబ్రవరి 19నుంచి 28వరకు సాగిన ఈ ప్రచార ఉద్యమంలో కుటుంబ విలువలను ప్రచారం చేశారు.  

మహిళలపై వరకట్న వేధింపులు.. అత్యాచారాలు.. పిల్లలపై దౌర్జన్యాలు.. వృద్ధులపై దాష్టీకాలు.. మలిసంధ్యలో తోడులేక దుస్థితిలో ఉన్న కన్నవాళ్లు.. ఇవన్నీ మన కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇంట్లో కుటుంబం బాగుంటేనే కదా సమాజం బాగుపడుతుంది. కుంటుపడుతున్న కుటుంబ వ్యవస్థను గాడిలో పెట్టుకుంటే సమాజాన్ని బలపర్చుకోవచ్చని తద్వారా దేశాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చనే సందేశంతో జమాఅతె ఇస్లామీహింద్ మహిళా విభాగం కుటుంబ విలువల  ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. కుటుంబ విశిష్ఠతను తెలియజేసే   ఈ కార్యక్రమాల్లో ముస్లిమ్ మహిళలు ఫ్యామిలీ వ్యాల్యూస్ ను ఎన్నో కుటుంబాలకు గుర్తుచేశారు. అమ్మానాన్న గొప్పతనం, అక్కా తమ్ముళ్ల ప్రేమాప్యాయతలు, పిల్లల పట్ల వాత్సల్యం గురించి చర్చాగోష్టులు నిర్వహించారు. బంధాలు, అనుబంధాల ఔన్నత్యాన్ని వివరించే సాహిత్యాన్ని ప్రచురించారు.

పలు వీడియోల్లో భార్యాభర్తల అన్యోన్యత గురించి అమ్మానాన్నల ఆదరణ ఎలా అనే విషయాలు ఆలోచింపజేశాయి. హైదరాబాద్, ఖమ్మం, కరీంనరగ్, పెద్దపల్లి, గోదావరిఖని, సంగారెడ్డి, సత్తుపల్లి, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, తాడేపల్లి గూడెం, ఏలూరు, చింతలపూడి, కాకినాడ, రాజమండ్రి, మండపేట తదితర పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ కుటుంబ విలువల ప్రచారాన్ని పెద్దఎత్తున చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించిందని ఆ సంస్థ తెలంగాణ ఉపాధ్యక్షురాలు ఆయెషా సుల్తానా చెప్పారు. పాఠశాలల్లో పిల్లలకు కుటుంబ విశిష్టతపై వ్యాసరచన పోటీలు, ప్రసంగ పోటీలు నిర్వహించామని ఆమె  పేర్కొన్నారు. వృధాశ్రమాలను సందర్శించి అక్కడి వృద్ధులలో మేమన్నామనే భరోసా ఇచ్చామని ఆమె చెప్పారు. 

సోషల్ మీడియాలో...

అమ్మానాన్నల ఔన్నత్యం, భార్యాభర్తల బంధం, ఆడ కూతుళ్ల పట్ల ప్రేమ, బంధుప్రేమ ఎలా ఉండాలి  అనే అంశాలపై రూపొందించిన వాట్సాప్, ఫేస్ బుక్ వీడియోలు విస్త్రృతంగా వైరల్ అయ్యాయి. 

ఓ సుదూర ప్రయాణం వంటి మన సుందర మైన జీవితం

దాని చిట్టచివరి గమ్యస్థానం ఓ మారుమూల స్మశానం

ఈ జీవితమే తాత్కాలికం అయినప్పుడు 

ఆప్తులతో శతృత్వం, ‘మన అనుకున్న వారితో వైరం ఎందుకు మనకు’ అని సాగే ఓ చిన్న వీడియో గొప్ప సందేశమే ఇచ్చింది. పటిష్ఠ కుటుంబంతోనే పటిష్ఠ సమాజమనే సందేశాన్ని అందరికీ హత్తుకునేలా చెప్పిన తీరు బాగుంది. 

మరో వీడియో..

బంధువులు ఏ కారణాలవల్లనయినా ఎంతసేపటికీ మిమ్మల్ని దూరం చేస్తున్నా, వారు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నా మనం వారిపట్ల బాధ్యతగా మెలగాలి. వారి హక్కులను నెరవేర్చాలి. మిమ్మల్ని ప్రేమించని బంధువుల్ని ప్రేమించడమే నిజమైన బంధుప్రేమ అనే సందేశం బంధాలు, బంధుత్వాల గొప్పదనం చెప్పకనే చెప్పింది. 

నాన్న గొప్పదనాన్ని చెప్పే మాటలు..

నాన్న నా భుజంపై చేయివేసి

ఈ ప్రపంచంలో బలమైన వాడు ఎవడు అని అడిగాడు

దానికి ‘నేనే’ అని బదులిచ్చాను

నాన్న నా భుజంపై నుంచి చేయితీసి 

మరి బలహీనమైనవాడు ఎవడు అని అడిగాడు

దానికి ‘నేనే’ అన్నాను

నా జవాబుకు  నాన్న ఎంతగానో ఆశ్చర్యపోయాడు

అదెలా? అని ప్రశ్నించాడు

‘నాన్నా మీ చేయి నా భుజంపై ఉన్నంతవరకూ నేనే బలవంతుణ్ణి

మీరు చేయి తీయగానే బలహీనుణ్ణి అయిపోయాను’ నాన్నా అని కౌగిలించుకున్నాను

నాన్న 

ఎంత వృద్ధుడైనా ..ఇంటికి బలమైన స్తంభం

రక్తసంబంధాల గురించి, బంధుత్వాల గొప్పతనాన్ని వివరించే ఇలాంటి  వీడియోలు సోషల్ మీడియాలో ఈ పది రోజులూ విస్తృతంగా వైరల్ అయ్యాయి. చాలామంది ఈ వీడియోలను తమ వాట్సాప్ , ఫేస్ బుక్ లలో స్టేటస్ గా పెట్టుకున్నారు. కుటుంబం చల్లగా ఉంటేనే.. సమాజం చల్లగా ఉంటుంది అనే సందేశం అందరినీ ఆలోచింపజేసింది. కుటుంబ వ్యవస్థను కాపాడుకోకపోతే మనముంటున్న సమాజానికి ప్రమాదమే. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిదీ.

✍️ రచయిత-ముహమ్మద్ ముజాహిద్

సెల్ నెం-96406-22076

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: