తెలంగాణలో కరోనా కలకలం...

మళ్ళీ లాక్డౌన్ విధించే దిశగా సర్కార్

పెరుగుతున్న కరోనా కేసులు

రాత్రి 9 గంటల తర్వాత పబ్స్, క్లబ్స్ మూసివేసే యోచనలో ప్రభుత్వం

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

తెలంగాణ ప్రాంతంలో మరోసారి కరోనా ప్రభావం అధికమవుతుండడం తో రాత్రిపూట కర్ఫ్యూ విధించేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాక్సీన్లను సైతం అందుబాటులో ఉంచారు. పాఠశాలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. 9,10 తరగతులకు చెందిన విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు వెళ్ళాలని, మిగిలిన తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు సెలవులు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. జనం అధికంగా ఉండే ప్రదేశాల్లో నిబంధనల్ని విధించేందుకు సిద్ధం చేస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గుంపులు గుంపులుగా జనం గుమిగూడి ఉండకూడదని పేర్కొంటున్నారు.

ఇదిలావుంటే తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్‌ అవుట్‌ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు. గతంలో  సర్కారు చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో 1.44 లక్షల కేసులు రాకుండా ఆపడంతో పాటు, 2300 మరణాలు నివారించగలిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా వెల్లడించిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమవ్వగా, నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్‌ విజృంభిస్తోంది. ప్రధానంగా  పొరుగున ఉన్న మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా లోకల్‌ ట్రైన్స్‌తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది. మన దగ్గర కూడా విద్యా సంస్థలు, హాస్టళ్లు,  గురుకులాల్లో వైరస్‌ వ్యాప్తి ఇటీవల బాగా పెరిగింది.

పాతబస్తీలో కరోనా కలకం..

అమ్మాయిల వసతిగృహంలో 9 మందికి పాజిటివ్

హైదరాబాదులోని పలు విద్యాసంస్థలు, వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి మరింత అధికమైంది. తాజాగా పాతబస్తీలోని ఓ బీసీ హాస్టల్లో కరోనా కలకలం రేగింది. రాజన్నబావి బాలికల వసతిగృహంలో 9 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ హాస్టల్లో 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా బారినపడిన బాలికలను ఐసోలేషన్ లో ఉంచారు. వారికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని పలు వసతిగృహాల్లో కరోనా ప్రబలడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగా, స్కూళ్లు, కాలేజీలు, విద్యార్థుల వసతి గృహాల్లో కరోనా వ్యాప్తి మరింత అధికమైంది. దాంతో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులను పై తరగతులకు నేరుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. కాగా, కొత్త కేసులు మరింత పెరుగుతుండడంతో ఇతర విద్యాసంస్థలు మూసివేతపైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అటు, పాక్షికంగా లాక్ డౌన్ విధించేందుకు కూడా సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్ల వద్ద ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. వారాంతపు దినాలు శని, ఆదివారాల్లో లాక్ డౌన్ విధించడంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చనని తెలుస్తోంది.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: