కీర్తి సురేష్ 'గుడ్ ల‌క్ స‌ఖి' ,,

జూన్ 3న విడుద‌ల‌

(జానోజాగో వెబ్ న్యూస్-సినీ బ్యూరో)

జాతీయ ఉత్త‌మ‌న‌టి కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'గుడ్ ల‌క్ స‌ఖి'. ఆది పినిశెట్టి హీరోగా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. విమ‌న్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి స‌హ నిర్మాత శ్రావ్య వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఎక్కువ మంది లేడీ టెక్నీషియ‌న్లు ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. న‌గేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతోంది. పాపుల‌ర్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్పిస్తోన్న 'గుడ్ ల‌క్ స‌ఖి'ని వ‌ర్త ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 3న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఒక రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ద్వారా సోమ‌వారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఆ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ ఓ గ‌న్ ప‌ట్టుకొని చిరునవ్వులు చిందిస్తుండ‌గా, ఆమెకు చెరోవైపు జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి నిల్చొని ఉన్నారు. స్పోర్ట్స్ రొమ్‌-కామ్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ ఒక షూట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ఇత‌ర ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు అన్ని వ‌ర్గాల నుంచీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది.

తారాగ‌ణం:

కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు.

సాంకేతిక బృందం:

డైరెక్ట‌ర్‌: న‌గేష్ కుకునూర్‌

స‌మ‌ర్ప‌ణ‌:  దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)

ప్రొడ్యూస‌ర్‌:  సుధీర్ చంద్ర పాదిరి

బ్యాన‌ర్‌: వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్‌

స‌హ నిర్మాత‌:  శ్రావ్య వ‌ర్మ‌

మ్యూజిక్‌:  దేవి శ్రీ‌ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  చిరంత‌న్ దాస్‌

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: