మార్చి 26న జరిగే భారత్ బంద్ ను,,

జయప్రదం చేయండి 

కార్మిక రైతు, విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నాయకులు  

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు ప్రతినిధి)

రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయరాదని, విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణ చేయరాదని,రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని కోరుతూ ఈ నెల 26న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని సిఐటియు కార్యాలయం నందు రైతు, కార్మిక, విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు అధ్యక్షులు లక్ష్మణ్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి బాల వెంకట్, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రమేష్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి తోట మద్దులు, ఆవాజ్ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్వలి, ఐయుఎంఎల్ జిల్లా నాయకులు సలాం మౌలానా, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి నరసింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చింతలయ్య, ప్రసాదు, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎమ్ డి రఫీ, మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు వీర సేన,వెంగన్న లతోపాటు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 26న జరిగే భారత్ బంద్ కు పట్టణంలోని మేధావులు, వ్యాపారస్తులు, సినిమా థియేటర్ యాజమాన్యం, చిల్లర వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు ,బంగారం అంగళ్ళ వ్యాపారస్తులు, ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే భారత్ బంద్ లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: