21ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి సేవలు

షేక్ సాజిదాకు ఛైర్మెన్ పదవి ఇచ్చి రుణం తీర్చుకోవాలి

ఆర్థికంగా, బందువర్గంలో పెద్ద కుటుంబం 

సౌమ్యులు కావడంతో రాజకీయంగా ఎదగలేకపోయారు

మైనార్టీల్లో ఫరూక్, నౌమాన్ స్థాయి కుటుంబం 


కౌన్సిలర్ షేక్ సాజిద

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా బ్యూరో)

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని అభిమానించే పెద్ద మైనార్టీ కుటుంబం. ఆర్థికంగా, బందువర్గం అధికంగా ఉన్నా రాజకీయంలో ఉన్నత పదవుల కోసం ఆలోచించలేదు. వైఎస్ఆర్ పై ఉన్న అభిమానమే ఏకంగా 21 ఏళ్లుగా పార్టీలో సౌమ్యులుగా పనిచేసుకుంటు సాగిపోయేవారు. మైనార్టీల్లో ప్రముకులైన మాజీ మంత్రి ఫరూక్, నౌమాన్ ల కుటుంబాల తర్వాత రాజకీయంలో బలమున్న కుటుంబం. ఎన్నికల్లో ఒక్కరూపాయి ఆశించకుండా సొంత డబ్బు ఖర్చు చేస్తూ పార్టీ గెలుపే అజెండాగా పనిచేశారు. సంజీవనగర్లో నివసిస్తున్న యూసఫ్ కుటుంబానికి మంచిపేరు ఉంది. మైనార్టీ వర్గాల్లో పేదలకు సహాయం చేస్తూ సౌమ్యులుగా పేరు తెచ్చుకున్నారు. కుటుంబ పెద్దల నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమానులు. యూసఫ్ యుక్త వయసునుంచే ఆ కుటుంబమంటే పిచ్చి. 2000 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం, పాదయాత్రలో చురుకుగా పాల్గొని ఆ కుటుంబం వైఎస్ దృష్టిలో అప్పట్లో పడటంతో మరింతగా రాజకీయాల్లోకి చొచ్చుకు పోయారు.
ఆనాటి నుంచి 2004 ,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీలో నిలబడిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి విజయానికి ఆ కుటుంబం ఉడుతా భక్తిని చాటుకుంది. వైఎస్ఆర్ మృతి చెందడం, ఆయన కుమారుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యధావిధిగా సేవలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీకి భూమా నాగిరెడ్డి నిలబడటంతో పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేశారు.2019 ఎన్నికల్లో మాజీ మంత్రి తనయుడు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేయడంతో యూసుఫ్ సొంత ఖర్చులతో ఆయన విజయానికి కృషి చేసారు. గత ఎన్నికల్లో యూసుఫ్ కౌన్సిలర్ బరిలో దిగినా  ప్రత్యర్థుల కుట్రలకు ఓటమి పాలయ్యారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో 37 వ వార్డుకు ఆయన సతీమణి షేక్ సాజిదా గెలుపొందింది. నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా ముగ్గురి పేర్లు బలంగా వినిపించాయి. శిల్పా రవి సతీమణి నాగిణిరెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లలితమ్మ, గతంలో ఛైర్మెన్ గా చేసిన దేశం సులోచన పేర్లు బలంగా వినిపించాయి. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేదానికి ఉదాహరణ నంద్యాల రాజకీయం మారింది. ప్రతి ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తుంది. ఏ ఎన్నికలు ఆ ఎన్నికలు చరిత్రను తిరగరాస్తున్నాయి. 2021 ఎన్నికలు ఎన్నో మలుపులు తిరిగాయి. ఛైర్మెన్ పదవులు ఎందరినో ఊహాలోకాల్లో విహరింపచేసాయి. తాము అనుకున్నది ఒకటైతే దైవం మరోలా రాజకీయం చేయడంతో ఛైర్మెన్ పదవులు ఆశించిన వారికి అధిష్టానం శిరోధార్యమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఛైర్మెన్ పదవి మైనార్టీలకు ఇవ్వాలని చెప్పడంతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి గెలుపొందిన కౌన్సిలర్లతో చర్చించారు. మైనరీలకు ఛైర్మెన్ పదవి వస్తుండటంతో చరిత్ర సృష్టిస్తుంది. ఛైర్మెన్ రేసులో నలుగురు ఉన్నా గతంలో కో ఆప్షన్ పదవి చేసిన మాబున్నిసా, 21 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న యూసుఫ్ కుటుంబానికి ఇవ్వాలో అర్తంకాకుండా పోయింది. ప్రజల్లో ఒక వైపు పార్టీని నమ్ముకుని లక్షలు ఖర్చు పెట్టిన వారికి న్యాయం జరుగుతుందా, అనిగి మణిగి వుండే వారికి పదవి కట్టబెడతారో అనే ప్రశ్న ప్రజల్లో టెన్షన్ పుట్టిస్తుంది. ప్రమాణ స్వీకారం 18 ఉండటం అభ్యర్థుల్లో, ప్రజల్లో ఉత్కంఠ మొదలయింది. నేతలు అభయహస్తం ఎవరికి ఇచ్చినా పార్టీకి కట్టుబడి మాకొచ్చిన పదవులకు న్యాయం చేస్తామని అభ్యర్థులు అంటున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: