కోట్పా 2003 చట్టానికి ప్రతిపాదిత సవరణలను ఉపసంహరించుకోవాలి

ప్రధానమంత్రికి బీడీ కార్మికుల డిమాండ్

 తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 21వేల మంది బీడీ కార్మి కుల ర్యాలీలు

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ఇప్పటికే కఠినమైన నిబంధనలు కలిగిన సిగిరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003  (కోట్పా)కు పలు సవరణలు చేయడం ద్వారా మరింత కఠినంగా ఈ చట్టాన్ని మార్చడానికి జనవరి 01, 2021వ తేదీన కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఒకవేళ ఈ ప్రతిపాదనలు కనుక చట్టరూపం దాలిస్తే శతాబ్దాలుగా హ్యాండ్‌ మేడ్‌ ఇన్‌ ఇండియాగా గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమ మూతపడే అవకాశాలు మొండుగా ఉండటమే కాదు దాదాపు 30 మిలియన్ల మంది బీడీ , సంబంధిత రంగాల్లోని కార్మికులు జీవనోపాధి కోల్పోనున్నారు. ఇప్పటికే బీడీ పరిశ్రమ అమలులో ఉన్న కోట్పా నిబంధనలను అనుసరిస్తూ సతమవుతుంటే, ప్రతిపాదిత చట్టాలు అమలు చేయడం అసాధ్యంగా మారతాయి. ప్రస్తుతం ఈ కార్మికులకు మరో ప్రత్యామ్నాయ ఉపాధి ఏమీ లేదు. కోట్పా ప్రతిపాదిత చట్టాల కారణంగా బీడీ పరిశ్రమ మూతపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా 8.5 మిలియన్ల మంది బీడీ కార్మికులు ఇంటి నుంచి పనిచేస్తుంటే, వారిలో 6.5 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. దాదాపు ఏడు మిలియన్ల మంది స్త్రీలు, ఆదివాసీలు తుమికి ఆకులను తెంపే పనిలో ఉంటే,  దాదాపు నాలుగు మిలియన్ల మంది రైతులు, కార్మికులు సైతం ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడ్డారు. ప్రతిపాదిత సవరణల వల్ల వీరంతా నష్టపోనున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీకలుగా ఈ రంగంలో పనిచేస్తున్న మహిళలు నిలుస్తుంటారు. ప్రస్తుత సంక్షోభం, బీడీ పరిశ్రమలో లక్షలాది మంది జీవనోపాధిని పరిగణలోకి తీసుకుని కోట్పా చట్టాల సవరణ ఆలోచనలను విరమించుకోవాల్సిందిగా బీడీ కార్మికులు ప్రధానమంత్రిని అభ్యర్థించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: