ఘనంగా స్వాతంత్ర సమర యోధుడు,,

కల్నాల్ మహబూబ్ అహ్మద్ 102వ జయంతి 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్వాతంత్ర సమర యోధుడు కల్నాల్ మహబూబ్ అహ్మద్ 102వ జయంతిని అల్ మదర్ పౌండేషన్ చైర్మన్ ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్వి డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా కాలేజ్  ప్రిన్సిపల్ మునిశేఖర్, అక్షర డిగ్రీ కళాశాల జువాలజీ లెక్చరర్ సుభానిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ ఆకుమల్ల రహీమ్ మాట్లాడుతూ
ఫ్రీడమ్ ఫైటర్ మహబూబ్ మహమ్మద్ కాలేజీలో  చదువుతున్న సమయంలోనే దేశభక్తిని, దేశంపై అభిమానాన్ని పెంచుకుని చదువు పూర్తి అయిన వెంటనే 1941సంవత్సరంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ నందు కెప్టెన్ గా ఉద్యోగం చేస్తూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వంటి నాయకులతో కలిసి పనిచేశారని, 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ నందు కల్నల్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని, ఇతని ధైర్యసాహసాలు దేశభక్తిని గమనించిన నాయకులు ఇతనిని హీరో ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గా పిలవడం జరిగిందన్నారు. కావున విద్యార్థులారా మీరు కూడా మంచి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ దేశభక్తిని సామాజిక బాధ్యతని  పెంపొందించుకుని ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుమల్ల రహీం,  సాంస్కృతిక విభాగపు జిల్లా నాయకులు శివరాం రెడ్డి, అల్ మదర్ ఫౌండేషన్ సభ్యులు ముల్లా ఆరిఫ్ ఉద్దీన్, అబ్దుల్ మజీద్, మురళి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: