ఏపీ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

తెనాలీలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

(జానోజాగో వెబ్ న్యూస్-తెనాలి ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకొన్నారు. ఆదివారంనాడు తెనాలి పట్టణంలోని తెనాలీ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యవర్గ సభ్యులు, విశ్రాంత అధ్యాపకులు మహమ్మద్ అజ్గర్ అలీ మాట్లాడుతూ..అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని యునెస్కో ప్రకటించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారన్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోందని ఆయన గుర్తుచేశారు.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోందని ఆయన వెల్లడించారు. ‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్ అని ఆయన పేర్కొన్నారు.

దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు అన్నారని ఆయన గుర్తుచేశారు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేడు ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందిందని కూడా ఆ‍యన పేర్కొన్నారు. గ్లిష్ భాష మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదని ఆయన పేర్కొన్నారు. సుసంపన్నమైన మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందించటం మన అందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యరద్శి రామకృష్ణ మూర్తి, కోశాధికారి బొమ్మదేవర వెంకటేశ్వర రావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.



,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: