బహుజన మతసామరస్య పాలకుడు..

ఛత్రపతి శివాజీ జయంతి

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్ పురం సర్కిల్ లో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన బహుజన చక్రవర్తి ఛత్రపతి శివాజీ జయంతిని ముస్లిం నగారా కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అద్భుత పరిపాలన తో పాటు మహిళలను గౌరవిస్తూతల్లి చెల్లి లా గౌరవించే వ్యక్తిత్వం అన్నారు  ఛత్రపతి శివాజీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే... ఒకసారి శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన కోడలును తీసుకొచ్చాడు. ఆమెను శివాజీ ముందు ప్రవేశపెట్టడంతో... శివాజీ ఆమెతో ఇలా అన్నాడు. "నా తల్లి కూడా మీ అంత అందమైనదైవుంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అని ఆమెను తల్లిగా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. అందుకే శివాజీ అంటే కులమతాలతో తేడా లేకుండా ఎంతగానో అభిమానించేవారు.
భారతదేశంలో ఎందరో రాజులు పాలించినప్పటికీ శివాజీకి వున్న గొప్పతనం విభిన్నమైనది. అణగారిన మెహర్ లను సైన్యంలో చేర్చుకొన్న ఘనత శివాజీ కే దక్కుతుందని మూల వాసులైన ముస్లిం సామాజిక వర్గానికి సముచిత స్థానాన్ని ప్రసాదించారని శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు! శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే!ఇలా అన్ని సామాజిక వర్గాలకు వసుధైక కుటుంబంగా సమానత్వాన్ని అందించిన మహనీయుడు శివాజీ అని  అన్నారు ఇలాంటి మహనీయుల జయంతులను మహనీయులు జ్యోతీరావు పూలే బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వారు జరిపి మనకు మార్గదర్శనం చేసారని మనం కూడా ఇలాంటి పరమత సహనం ను ఆచరణాత్మక జీవితం గడిపిన మహనీయుల అడుగు జాడల్లో నడవగలిగినప్పుడే దేశంలో శాంతి సుస్థిరతలు వర్ధిల్లు తాయని అన్నారు చివర్లో ఛత్రపతి శివాజీ అమర్ హై అని నినాదాలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్ మానవతా  రక్తదానం సభ్యులు జబీ. ఖాదర్.వలీ. ఇస్మాయిల్ జబీఉల్లా తదితరులు పాల్గొన్నారు

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: