టేస్టీ...టేస్టీ...బుల్లెట్ ఫుడ్..గోల్డెన్ ఫుడ్

దంపుడు మసాలాతో కడ్డీ చికెన్

సెంట్రల్ సిలబస్ లో డిగ్రీ చదివి...స్వశక్తితో టేస్టీ రుచులందిస్తున్న కళ్యాణ్ బాబు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 దేశవ్యాప్తంగా ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగ సమస్య. చదివిన చదువులకు ఉద్యోగాలు రాక నిస్సహాయతలో తల్లిదండ్రులపై కొందరు ఆధారపడి జీవితాలు భారంగా నెట్టుకొస్తున్నారు. పేద కుటుంబంలో జన్మించి చిన్న నాటి నుంచి కష్టపడి చదువులో రాణిస్తూ సెంట్రల్ సిలబస్ లో డిగ్రీ చేసి ఉద్యోగం రాలేదని బెంగ పడకుండా రుచికరమైన వంటకాలు  ప్రజలకు అందించాలని మనసులో నిచ్ఛయించుకున్నారు. రెండేళ్లు బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వివిధ రకాల వంటకాలపై శిక్షణపొంది సఫలీకృతులయ్యారు. బర్గర్, పిజ్జా తదితర వంటకాలు సిటీలనుంచి పల్లెటూరుకు ప్రాకిపోవడంతో వ్యాపారాలు మందగించిపోయాయి. యువత, ప్రజలను ఆకర్షించడానికి నూతన ఒరవడే లక్ష్యంగా పెట్టుకున్నారు.

పట్టణాల్లో దుకాణాల బాడుగలు బైర్లు కమ్మేవిధంగా ఉండటంతో కొద్దిరోజులు ఎటూ పాలుపోలేక ఆలోచనలో పడ్డారు. భార్య మౌనిక సహకారంతో గోల్డెన్ ఫుడ్ తో టేస్టీ చికెన్ కడ్డీలను ప్రజలముందు బుల్లెట్ ఫుడ్ తో ప్రజలను టేస్టీతో ఆకర్షించి వ్యాపారంలో విజయం సాదించిన బైర్మల్ వీధికి చెందిన కళ్యాణ్ బాబు. సమాజంలో నేటి యువతను ఆకర్షిస్తున్న సింహం లాంటి వాహనం బుల్లెట్. బుల్లెట్ వాహనంపై సవారీ మధురానుభూతి. ప్రస్తుత కాలంలో బుల్లెట్ వాహనం స్టేటస్ సింబల్ గా మారిపోయింది. వ్యాపారంలో రాణించేవారికి సవా లక్ష ఆలోచన అనేదానికి కళ్యాణ్ బాబు ఆలోచనకు హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వ్యాపారాన్ని ఆకర్షించడానికి ఏకంగా బుల్లెట్ వాహన్నాన్నే వ్యాపార ఆయుధంగా మలుచుకొని యువత, ప్రజలను ఆకర్షించారు. పద్మావతీ నగర్ ఆర్చి వద్ద  గోల్డెన్ ఫుడ్ పేరిట నెంబర్ 1 కె.జి.ఎఫ్, బి.బి.క్యూ సింబల్ తో వ్యాపారాన్ని కొనసాగించారు. పట్టణంలో పద్మావతీ నగర్ లో ఎన్నో చికెన్ కడ్డీ సెంటర్లు వెలిశాయి. కొత్త,కొత్త రుచులకు అలవాటు పడ్డ ప్రజలు సాయంత్రం వేళల్లో జిహ్వ చాపల్యం కోసం విభిన్న రుచులు ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న చికెన్ కడ్డీ రుచులను దీటుగా రుచులు అందిస్తే వ్యాపారం సాగుతుందని పాత కాలం పద్ధతులను వ్యాపార రహస్యంగా మలుచుకున్నారు.

పద్మావతీ నగర్లో కొందరు వ్యాపారులు వేప బొగ్గు ఉపయోగించడంతో కొద్దిగా వాసన వస్తుండటం గమనించారు. చికెన్ కడ్డీ రుచిగా,టేస్టీగా, వాసన రాకుండా ఉండేందుకు కొండ కట్టెలు ఉపయోగిస్తూ దంపుడు మసాలాలు ఉపయోగించడంతో టెస్టికి టేస్టీ, రుచికి రుచితో వ్యాపారంలో విజయం సాధించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ బాబు వ్యాపార విజయానికి చికెన్ ను వెనిగర్, పసుపు, ఉప్పుతో వాసన రాకుండా శుభ్రపరిచి శుద్ధమైన నెయ్యి, పిస్తా, కాజు పొడి, పండు మిరప కారంతో పాటు మసాలాలు రోట్లో దంచి వేయడం, ప్రత్యేక కడ్డీ మిషన్లో కాల్చడంతో వాసన రాకుండా ప్రజలకు మెచ్చే టేస్టీ చికెన్ కడ్డీలను అందిస్తున్నామని విజయ రహస్యం చెప్పుకొచ్చారు. మొదట్లో రోజు 2 కేజీల చికెన్ కడ్డీల వ్యాపారం నేడు ఏడు, ఎనమిది కేజీల వరకు వ్యాపారం సాగడానికి కారణం టేస్టీ. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాలేదని ఆవేదన చెందకుండా స్వశక్తితో ఒకరిపై ఆధార పడకుండా పలువురికి జీవనోపాధి కల్పిస్తున్న కళ్యాణ్ బాబుకు మనం చేయాల్సింది.చికెన్ రుచులు ఆస్వాదించేవారు ఒక్కసారి టెస్ట్ చేస్తే మరోసారి రుచి చూడాల్సిందేనని రుచి చూసిన వారు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి టేస్టీ రుచి పని పట్టాల్సిందే.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: