వరవరరావు కు బెయిల్ మంజూరు

ఆదేశాలు జారీ చేసిన ముంబయి హైకోర్టు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ముంబయి హైకోర్టు ఆదేశాల ను జారీ చేసింది. భీమా కొరేగావ్ కేసులో ఆయనను నాంపల్లి క్రిమినల్ కోర్టు లో రిమాండ్ చేసి ముంబయి జైలుకు తరలించిన విషయం విదితమే. ఆరు నెలల కోసం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల తర్వాత మళ్లీ కొనసాగింపు పిటిషన్ ను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. తనతో ఫోన్ ద్వారా మాట్లాడే మొబైల్ నెంబర్ల ను ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పోలీసులకు వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన నాణవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారనే విషయం డాక్టర్ల సలహా మేరకు నిర్వహిస్తారు.

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైద్రాబాద్.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: