వైభవంగా భద్రావతి, భావనారుషి..

 కల్యాణ వేడుకలు ప్రారంభం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలలోని శ్రీనివాస నగర్లో ఉన్న భద్రావతి భవనారుషి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో చిన్నారులు 108 కలశములతో పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా ఆలయానికి తెచ్చారు. అనంతరం స్వామి వారికి గంగాజలంతో అభిషేకం చేశారు. గుడిపాటి గడ్డలోని వెంకటేశ్వర ఆలయంలో పద్మశాలిల ఆడపడుచు పద్మావతి అమ్మవారికి చీరా, సారెను,  స్వామివారుకి పట్టువస్త్రాలను అందజేశారు. సాయంత్రం భవాని సహిత భావనందేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గంజి వెంకటేశ్వర్లు, కోశాధికారి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: