ఘనంగా జంబూలాపరమేశ్వరి అమ్మవారి తిరుణాల

పోటెత్తిన భక్తులు..కన్నులపండుగగా శోభాయాత్ర

రేపు గాడిదలు పందాలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జంబూలాపరమేశ్వరి అమ్మవారి  ఆలయంలో తిరుణాల ఘనంగా జరిగింది. మాఘమాసం పౌర్ణమి రోజైన శనివారం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించారు. తెలుగుపేట నుండి ప్రారంభమైన అమ్మవారి శోభా యాత్ర ప్రారంభమై పెద్దబండ, రజకపేట, బైటిపేట మీదుగా ఆలయాన్ని చేరింది, వందలాది మంది మహిళలు సంప్రదాయ బద్దంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. నిర్వాహకులు ఈ ఏడాది చెక్కభజనను ఏర్పాటు చేయ్యడంతో శోభాయాత్రకు మరింత శోభ చేకూరింది.

జంబూలా పరమేశ్వరి అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. బోనాలు సమర్పించడానికి భక్తులు వేల సంఖ్యలో రావడంతో అలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. కర్నూలు, నంద్యాల మాజీ ఎంఎల్ఏలు ఎస్.వీ. మోహన్ రెడ్డి,  భూమా బ్రహ్మానంద రెడ్డి, పాలడైరీ ఛైర్మెన్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గాడిదల పోటీ : 

తిరుణాల సందర్భంగా శనివారం ఆలయంలో గాడిదల పోటీని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి గాండ్ల జగన్,  ఆర్గనైజర్లు పరమేశ్వర రెడ్డి, జిలెల్ల శ్రీరాములు, నాగరాజు,  హనుమాన్ శ్రీను పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: