పాణ్యం పోలీంగ్ కేంద్రాన్ని, బలపనూరు పోలీంగ్ కేంద్రాలను...

ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి

పోలీంగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

పాణ్యం పోలీసుస్టేషన్ పరిధిలోని పాణ్యం పోలీంగ్ కేంద్రం, బలపనూరు పోలీంగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ శుక్రవారం పరిశీలించారు. పోలీసు అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు.
2వ విడత గ్రామపంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భద్రతా చర్యలను చేపట్టిందన్నారు. ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట నంద్యాల డిఎస్పీ చిదానంద రెడ్డి, నంద్యాల తాలుకా సిఐ మురళీ మోహాన్, ఎసిబి ఇన్ స్పెక్టర్ సీతారామి రెడ్డి,  పాణ్యం ఎస్సై రాకేష్ లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: