ప్రమాదకరంగా తయారయినా రోడ్డును బాగు చేయండి

భారతీయ జనతా పార్టీ ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి )

ప్రమాదకరంగా తయారయినా రోడ్డును బాగు చేయండని సంబంధింత అధికార్లకు, ప్రజాప్రతినిధులను భారతీయ జనతా పార్టీ ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు మనం ఏ పనికైనా  ఎక్కడికి వెళ్లాలన్న తిరిగి గమ్యం చేరాలన్న అది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు ఎవరైనా రోడ్డుమార్గం గానే పోవాలి మనం క్షేమంగా వెళ్లి లాభంగా భద్రంగా ఇంటికి వస్తామని మనకోసం నిత్యం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు కానీ సంబంధిత రోడ్డు వారు రోడ్డును మెరుగుగా చేస్తేనే ప్రమాదాలు జరగకుండా ఎవరైనా క్షేమంగా వెళ్లి తిరిగి వస్తారు ఆలా వెళ్లి తిరిగి రావాలంటే ముఖ్యంగా రోడ్లు బాగుండాలి.

దానికి ఉదాహరణ  హైదరాబాద్ భూపాలపట్నం జాతీయ రహదారిలో ఆలేరు పట్టణం లో ప్రకాష్ గార్డెన్ దగ్గర  బైపాస్ రోడ్డు ప్రారంభం లో ఆలేరు పట్టణం లోకి ప్రవేశించే క్రమంలో బీటీ (తారు డంబార్) పూర్తిగా వేయక పోవడంతో పెద్ద గోతి ఏర్పడి  కంకర తేలి రోడ్డు పైకి పరుచుకోవడం తో ఆ ప్రదేశం వంకర మలుపు ప్రమాదంగా తయారయ్యింది ఎల్ &టీ మెయింటనెన్స్ వారికి పలు మార్లు విన్నవించిన పూర్తిగా సమస్య ను పరిష్కరించ లేకపోతున్నారు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో రోడ్డు వేయాలని ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు రేడియం వేయాలని కోరుతున్నాను. అని బందెల సుభాష్ కోరారు.

అధ్వానంగా తయారైన రహదారి చిత్రాలు 
 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: