మా అంచనాలను నిజం చేసిన 

" అన్నపూర్ణమ్మ గారి మనవడు" 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

 "అన్నపూర్ణమ్మ గారి మనవడు" చిత్రం పై మేము పెట్టుకున్న అంశాలను ప్రేక్షకులు నిజం చేశారని ఆ చిత్ర బృందం వెల్లడించింది.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మ గా,  మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించిన చిత్రమిది.బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా  నటించగా, ఓ కీలక పాత్రలో సీనియర్ నటి జమున నటించారు.ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో  ఎం.ఎన్.ఆర్.చౌదరి నిర్మించిన ఈ చిత్రం రెండు రాష్ట్రాలలో థియేటర్లలో విడదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న  సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన  సక్సెస్ & థాంక్స్ మీట్ ను చుత్ర బృందం నిర్వహించింది... ఈ సందర్భంగా చిత్ర బృందం అనందోత్సాహాల మధ్య కేక్ ను కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. 

 చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు)మాట్లాడుతూ ... రెండు రాష్ట్రాలలో ఈ చిత్రాన్ని 250 థియేటర్లలో విడుదల చేశాం. అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం.క్లాస్ ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రాన్ని చూస్తున్నారు.యూత్ ఫుల్ చిత్రాలకు తీసి పోని విధంగా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు..

 చిత్ర నిర్మాత .ఎం.ఎన్.ఆర్ చౌదరి మాట్లాడుతూ .. ఈ చిత్రం బాగా రావడం తో పాటు విజయవంతంగా నడవడానికి కారణం దర్శకుడికే చెందుతుంది.ముందుగా ఓవర్ సీస్ అమెజాన్ లో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో కూడా ఇక్కడి ప్రేక్షక ఆదరణ పొందుతుండటం మా చిత్ర బృందానికి  ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు."

 హీరో బాలాదిత్య మాట్లాడుతూ.. నేటిరోజుల్లో సినిమా సక్సెస్స్ కు అర్థం మారింది.కొద్దీ రోజులు మంచి కలెక్షన్స్ తో ఆడినా పెట్టుబడితో పాటు లాభాలు తిరిగి వస్తున్నాయి.ఈ సినిమా కూడా ఆ కోవకు చెందింది గా భావిస్తున్నాను.అర్చన తన పాత్రలో అద్భుతంగా నటించిందని అందరూ చూపుతున్నారని అన్నారు.

 హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ..హృదయాలను హత్తుకునే చిత్ర మిది. థియేటర్ లకు వెళ్లి మరీ ప్రేక్షకులు చూస్తున్నారు., ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశాను అయితే కొన్నే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి చిత్రాలలో ఈ చిత్రం ఒకటి అని చెప్పారు.

 తెలుగు చిత్ర నిర్మాతల మండలి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... మానవ సంబంధాలు ,అనుబంధాలు రంగరించి తీసిన చిత్రమిది. పాత తరం నుండి నేటి తరం వరకు ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారు.ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

 మనవడి పాత్రధారి మాస్టర్ రవితేజ మాట్లాడుతూ.. ఇలాంటి చక్కటి సెంటిమెంట్ తో కూడుకున్న చిత్రంలో నేను నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు

 రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ రావడం మా అందరికీ ఆనందంగా ఉందని అన్నారు.

 ఆమెజాన్ ప్రతినిధి రాజీవ్ మాట్లాడుతూ. . థియేటర్ ల తరువాత ఇండియన్ ఓ.టి.టి లో కుడా త్వరలో విడుదల చేస్తామని అన్నారు..

ఇంకా ఈ కార్యక్రమంలో అర్చన భర్త జగదీష్ కూడా పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: