విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

ప్రైవేటీకరిస్తే బీజేపీకి పుట్టగతులుండవ్

పీవైఎల్ నాయకులు యూ.నవీన్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానిని ప్రైవేటుపరం చేయడానికి వస్తే కేంద్ర ప్రభుత్వం పుట్టగతులుండవని పీవైఎల్  జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్ డిమాండ్ చేశారు.      *నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) ముఖ్యలు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్)జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానిని దోమ ఎంతోమంది త్యాగం చేసి సాధించుకున్నారని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయడానికి కి చర్యలు చేపట్టడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎన్నో వేల మందికి ఉపాధి లభిస్తుందని అటువంటి దాన్ని ప్రైవేట్ పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అని అన్నారు బిజెపి కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న జగన్ నోరు మెదపక పోవడం చాలా విడ్డూరమని అన్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాధంతో సాధించుకున్న దానిని ఈ రోజు బిజెపి కేంధ్ర ప్రభుత్వం ప్రవేయిట్ పరం చేయడానికీ చర్యలు చేపట్టడం ఏంతవర కు సమంజసమని అని అన్నారు.
ఆంద్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు మరియు కడప ఉక్కు అనేవి కేంద్ర ప్రభుత్వం భిక్ష కాదు అని అది ఆంధ్రుల హక్కు అనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వంలో ని బీజేపీ ఈ దేశం లో ప్రభుత్వ రంగ పరిశ్రమ లను బజారూ లో అంగడి సరకులగా అమ్మేస్తూ తద్వారా కార్పొరేట్ లకు ఊడిగం చేస్తోంది అన్నారు..లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లో కానీ విశాఖ ఉక్కు ని నిలబెట్టుకోవడం లో కేంద్ర ప్రభుత్వ పాత్ర కానీ బీజేపీ పాత్ర కానీ శూన్యం అన్నారు ఆలాంటి మీరు ఈ రోజు గంగి గోవు లాంటి పరిశ్రమ ని అమ్మేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచుతున్నారని అన్నారు.విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేడు ఉసేత్తడం లేదు అన్నారు.విశాఖ ఉక్కు 32 మంది అమరుల త్యాగ ఫలితం అన్నారు కనీసం 2 లక్షల మంది ప్రత్యక్షంగా జీవనం కొనసాగిస్తున్నరూ అని అన్నారు..విశాఖ నగరానికి ఉక్కు పరిశ్రమ పెద్ద దిక్కు అని ఎలా అమ్మేస్తారని ప్రశ్నించారు...ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఉన్న పరిశ్రమ ని అమ్మేస్తే చూస్తూ ఊరుకొనే సమస్యే లేదన్నారు...ఇప్పటికే ఈ రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది అని ,పిచ్చి వాళ్ళను అధికారం లో వస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ ఈ ప్రభుత్వాలు అన్నారు.రాష్ట్రంలో ఉన్న అధికార,ప్రతి పక్ష పార్టీ లకు ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రజల మీద చిత్త శుద్ధి ఉన్నా వెంటనే ఉక్కు పోరాటం లో  పాల్గొనాలని డిమాండ్ చేశారు.ప్రజలు తిరుగుబాటు మిమ్మల్ని గద్దె దించక ముందు కడప,విశాఖ ఉక్కు ని సాదించుకోవలన్నారు. ఈకార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ నాయకులు అఖిల్ నాయక్ రవి వంశీ మొదలైన వారు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: