నంద్యాల రక్తదాన సేవకులు దాదాభాయ్, సద్దాం హుసేన్ లను...

సన్మానించిన కర్నూలు తలసేమియా వెల్ఫేర్ అసోసియేషన్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం అందేలా కృషి చేస్తున్న రక్తదాతలను ప్రోత్సహిస్తూ కర్నూలు తలసేమియా వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహించిన సన్మాన సభలో నంద్యాలకు చెందిన దాదాభాయ్, బాబా ఫకృద్దీన్, సద్దాంలను ఘనంగా సన్మానించారు. తలసేమియా బాధితులకు సాధారణంగా ప్రతి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుంది సరైన సమయానికి రక్తం ఎక్కించకపోతే తలసేమియా బాధితులకు ప్రాణాలకే ప్రమాదమని, ఈ పరిస్థితుల మధ్య ప్రతీ 20 రోజులకు ఒకసారి వారికి రక్తదాతలు దొరకడం ఇబ్బందిగా ఉంటుంది. దీనిని గమనించిన సద్దాం, దాదాభాయ్, బాబా ఫకృద్దీన్ ముగ్గురు కలిసి నంద్యాల,  చుట్టుప్రక్కల ఉన్న తలసేమియా భాదితుల వివరాలు సేకరించిన వారికి ఎప్పుడు రక్తం అవసరమైన మమ్మల్ని సంప్రదించమని అండగా నిలిచారు.
అప్పటి నుండి తలసేమియా బాధితులకు రక్తం ఎక్కించే ఒకరోజు ముందు ఈ ముగ్గురికి సంభందిత తలసేమియా భాదితులు సమాచారం అందిస్తారని, సమాచారం తెలుసుకున్న వెంటనే బ్లడ్ ఆర్గనైజర్స్ అయినటువంటి సద్దాం, దాదాభాయ్, బాబాలు తమ తమ మిత్రులకు ఫోన్లు చేయడం,  సామజిక మాధ్యమాల ద్వారా సమాచారం వ్యాప్తి చేసి కావాల్సిన బ్లడ్ గ్రూప్ రక్తదాతను తలసేమియా బాధితులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఒక్కొక్కసారి ఒకే రోజు ముగ్గురు, నలుగురు తలసేమియా బాధితులకు రక్తం అవసరం పడుతుందని, అప్పుడు కూడా కావాల్సిన రక్తదాతలను బ్లడ్ ఆర్గనైజర్లు సిద్ధం చేస్తారు. సిద్ధం చేసిన రక్తాన్ని స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్, నంద్యాల వారు ఎటువంటి టెస్టింగ్ చార్జెస్ లేకుండా పేషంట్ వారికి అందజేస్తారు. లాక్ డౌన్లో రక్తదాతలు దొరకక ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా  వీరు ముగ్గురు రక్తదాతల విషయంలో తలసేమియా భాదితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు రక్తదాతలను సిద్ధం చేసారు. ఇలా మానవతా దృక్పతంతో వీరు చేస్తున్న సేవలను తలసేమియా కర్నూలు వెల్ఫేర్ సోసైటీ వారు గుర్తించి ఫిబ్రవరి 23వ తేదీన కర్నూలు తలసీమియా సొసైటీ మొదటి వార్షికోత్సవం సంధర్భంగా కర్నూలు బి క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా దాదాభాయ్, సద్దాం మాట్లాడుతూ  తలసేమియా వారి కోసం చేసే రక్తదానం వారికి ప్రాణదానం లాంటిదని, వారికి ఇచ్చే రక్తం కూడా ఎటువంటి టెస్టింగ్ చార్జెస్ లేకుండా ఉచితంగా అందజేయబడుతుందన్నారు. నంద్యాల ప్రజలు ఎప్పుడైన తలసేమియా బాధితులకు రక్తం అవసరమని సామాజిక మాధ్యమాల్లో చూసిన వెంటనే స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. తలసేమియా వారి కోసం రక్తదానం చేయదలచిన వారు దాదాభాయ్ 9550781090 నెంబర్ కు సంప్రదించవచ్చన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: