నేడు తెలంగాణ న్యాయ వాదుల నిరసనలు

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల తొలగింపుపై ఆగ్రహ జ్వాలలు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

 తెలంగాణలోని అన్ని కోర్టుల్లో పని చేస్తున్న టె న్యూర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ల తొలగింపుపై మంగళవారం ఉదయం తెలంగాణ న్యాయ వాదుల చే నిరసనల ప్రదర్శన చేస్తున్నట్లు ప్రకటించారు. రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను నియమిస్తున్నట్లు జీ.వో వెలువడింది. ప్రస్తుతమున్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను తొలగిస్తున్నట్లు జీ వో జారీ చేసిన విషయం విదితమే. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీ.వో లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయ వాదులతో పాటు జూనియర్ న్యాయ వాదులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.  మంగళవారం నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. న్యాయ వాద మిత్రులందరూ పాల్గొనాలని కోరారు. 

✍️-రిపోర్టింగ్-డి. అనంత రఘు

అడ్వకేట్.హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: