ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, పందెంకోడి ఫేమ్ లింగుసామి సూప‌ర్ కాంబినేష‌న్‌లో..

శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ కొత్త చిత్రం

(జానోజాగో వెబ్ న్యూస్-సినీ బ్యూరో)

ఇస్టార్ శంక‌ర్ మూవీలో ప‌క్కా మాస్ క్యారెక్ట‌ర్లో న‌టించి సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్  చిత్రం తెర‌కెక్కుతోంది. గురువారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ - ‘‘చాలా కాలంగా హీరో రామ్‌తో సినిమా చేయాల‌ని మంచి స‌బ్జెక్ట్ కోసం చూస్తున్నాం. లింగుసామిగారు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ మా అంద‌రికీ న‌చ్చిరామ్‌గారికి వినిపించాం. క‌థ విన‌గానే ఆయ‌న కూడా చాలా  ఎగ్జైట్ అయ్యి వెంట‌నే సినిమా చేద్దామ‌ని అన్నారు. ఈ మూవీ రామ్‌, లింగుసామి కాంబినేష‌న్‌లో ఒక  ఊర‌మాస్ సినిమాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. మా బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రెస్టీజియ‌స్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నాం. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా న‌టిస్తోన్నఈ చిత్రానికి

బ్యాన‌ర్: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్,

స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌,

నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి,

ద‌ర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుసామి. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: