క్షౌరవృతి లో కార్పోరేట్ శక్తులను అడ్డుకోవాలి

కె.అర్.హరిప్రసాద్ మంగలి డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-మంచిర్యాల ప్రతినిధి)

క్షౌరవృతి లో కార్పోరేట్ శక్తులను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ నాయీ బ్రహ్మణ సోదరులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  మంచిర్యాల జిల్లా నందు జిల్లా క్షౌరవృతి నాయీబ్రహ్మణ అద్యక్షుడు అఐరిపెల్లి వెంకన్న అధ్వర్యంలో స్థానిక ఐబీచౌరస్తలో  28 వ రోజు రిలే నిరహరదిక్ష సాగింది. ఈ దీక్షకు ముఖ్య అతిధిగా మంగలి మహసభ జాతియ సంఘం నాయకులు కె.అర్.హరిప్రసాద్ మంగలి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ తరతరాల వెట్టి చాకిరి మాది ఆధునికతరం అభివృద్దిమిద గత29 రోజులుగా మంచిర్యాల పట్టణంలో మంగలి షాపులు బంద్ పటిస్తూ రిలే నిరహర దిక్షలు చేస్తున్నారన్నారు. మా  కుల వృత్తిలోకి అగ్రకులాల వారు  రావడాన్ని నిరసిస్తూ పోరాటం చేయడం జరుగుతోందన్నాు. కార్పొట్ వ్యవస్థల పేరిట మా కుల వృత్తివారి ఉసురు పోసుకోవద్దని ఆయన హితవు పలికారు. మా వృత్తిదార్ల కుటుంబాల పోటకొటకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ కలగజేసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మన రాష్ట్రలలో క్షౌరవృతిలోకి చొరబడుతున్న కార్పోరేట్ సంస్థలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మా కుల వృత్తి అయిన క్షౌరవృతిపై మాకు పేటేంట్ హక్కుకావాలి అని అన్నారు

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: