తొలితరం కమ్యూనిస్టు విప్లవకారుడు

సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీనేత కామ్రేడ్ పెద్దింటి గోకారి వర్ధంతి సభ

నివాళులర్పించిన పీవైఎల్, పీడీఎస్ యూ నేతలు 


         
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి) 

       కర్నూలు జిల్లాలో తొలితరం కమ్యూనిస్టు విప్లవకారుడు,సీపీఐ(ఎంఎల్)న్యూడెమెక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దింటి గోకారి ఆరవ వర్ధంతి సభను నంద్యాల  పట్టణంలోని స్థానిక సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యూ) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ,  ప్రగతిశీల యువజన సంఘం జిల్లా (పీవైఎల్)జిల్లా కార్యదర్శి యు నవీన్ కుమార్, ఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్ బాషా, మాట్లాడుతూ కామ్రేడ్ గోకారి గారు 16 సంవత్సరాల వయస్సులోనే కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై 86 సంవత్సరాలు నిండిన పొరుబాటను,విప్లవోద్యమాన్ని వీడకుండా తుదిశ్వాస వరకు  విప్లవోద్యమంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమెక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గా పనిచేశారని అన్నారు.కార్మికుడిగా పనిచేస్తూ కార్మిక హక్కుల సాధనకు మద్దతుగా కార్మిక నాయకుడిగా ,ఉద్యమకారుడిగా  దోపిడీ,దౌర్జ్యన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని ఆయన సేవలను కొనియాడారు.1968 సంవత్సరంలో విప్లవపార్టీ నిర్ణయం మేరకు కర్నూలు మునిసిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి ఎన్నికలు ఒక బూటకమని ,అంతిమంగా ప్రజా పోరాటం ద్వారానే ఈ వ్యవస్థ మారుతుందని నమ్మినవ్యక్తి కామ్రేడ్ పెద్దింటి గోకారి అని అన్నారు.రాయలసీమ సాయుధ ముఠాలకు వ్యతిరేకంగా పోరాటం  చేశారన్నారు.

 

భారత విప్లవోద్యమ రథసారధులైన కామ్రేడ్ చంద్రపుల్లా రెడ్డి,నీలం రామచంద్రయ్య ఉద్యమ సహచరుడిగా నిలబడి పార్టీ నిర్ణయంలో భాగంగా జిల్లాలో భూపోరాటంలో,ప్రజాపోరాటలలో కామ్రేడ్ గోకారి కీలకపాత్ర పోషించారని అన్నారు.1976 సంవత్సరంలో ఎమర్జెన్సీ లో 18 నెలలు జైలు నిర్బంధానికి గురయ్యాడని అన్నారు.రాయలసీమ హక్కుల సాధనకై జరిగే ఉద్యమాలలో కీలకపాత్ర పోషించి, చివరి శ్వాస వరకు విప్లవోద్యమంలో ,సీపీఐ(ఎంఎల్)న్యూడెమెక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి గా సేవలు అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇఫ్టూ నాయకులు ఫరూక్, పిడిఎస్యు, పీవైఎల్  నాయకులు అఖిల్, దస్తగిరి,షాకేర్,నాయక్,బాలు,సాయి, మొదలైన వారు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: