రోజుకో మలుపు తిరుగుతున్న..

న్యాయ వాద దంపతుల హత్య ఉదంతం

బిట్టు శ్రీనును విచారిస్తున్న పోలీసులు

నింధితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళనలు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు, నాగమణి హత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు హత్యకు గల బలమైన కారణాలను ఇప్పటి వరకు పోలీసులు వెల్లడించలేదు. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కత్తులు, వాహనాన్ని సమకూర్చి హత్యకు ప్రధాన కారణమయ్యాడు అనే ప్రాథమిక సమాచారంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు రామమందిరం భూ వివాదానికి, ఈ హత్యకు సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మందిర భూ వివాదానికి సంబంధించి న్యాయ వాది నాగమణి పోలీసు అధికారితో మాట్లాడిన ఫోన్ కాల్ సోషల్ మీడియా లో వైరల్ ఆయన విషయం తెలిసిందే.
లాకప్ డెత్ విషయం పట్ల హైకోర్టులో కొనసాగుతున్న కేసును వాపసు తీసుకోవాలని వామన రావు దంపతులకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు హైకోర్టు జస్టిస్ కు విన్నవించిన సంగతి విదితమే. కుంట శ్రీనివాస్, వామన రావు దంపతుల మధ్య గత కొంతకాలంగా పడడం లేదు అందుకే వారిని అడ్డు తొలగించాలని ఈ హత్య కు పథకం రచించినట్లు ఓ ఫోన్ కాల్ ద్వారా పోలీసులు  కుంట శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యాభై లక్షల సుపారికి ఒప్పందం చేసుకుని, అడ్వాన్స్ గా పది లక్షలు ఇస్తానని మాట్లాడిన కుంట శ్రీనివాస్ ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించారు. ఎవరి లబ్ధి కోసం ఈ హత్య చేయించారు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. మహిళా న్యాయ వాది అతి కిరాతకంగా హత్యకు గురైన సంఘటన పట్ల పలు మహిళా సంఘాలు, న్యాయ వాదులు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి.  న్యాయ పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్యం వెంటనే ఓ కమిటీ వేసి రక్షణ కోసం న్యాయ వాదులకు ప్రత్యేక చట్టం రూపొందించాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని బార్ అసోసియేషన్ లు డిమాండ్ చేస్తున్నాయి.  బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ న్యాయ శాఖ మంత్రి సైతం చొరవ తీసుకుని త్వరిత గతిన చట్టాన్ని రూపొందించాలని కోరుతున్నారు. 

 ✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు
అడ్వకేట్.హైద్రాబాద్


Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: