గట్టు వామన రావు, నాగమణి దంపతుల కుటుంబాన్ని..

పరామర్శించిన తెలంగాణ జే ఏ సి

మంథని బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో న్యాయ వాదుల నిరసన ర్యాలీ

వాస్తవాలు సేకరించిన జాక్ సభ్యులు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ జాక్ ఆద్వర్యంలో శనివారం హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభం అయిన బృందం సభ్యులు కరీంనగర్ బార్ అసోసియేషన్ కు చేరుకున్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వాదులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిబిఐ చే విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయ వాది దంపతులు వేసిన కేసుల వివరాలను సేకరించి వాస్తవాలను వెలికతీసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. న్యాయ వాదికే రక్షణ లేకపోతే న్యాయాన్ని కాపాడే నాథుడే కరువయ్యే పరిస్థితి ఏర్పడుతోంది అని అన్నారు. అనంతరం హత్య జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘటన స్థలంలోనే  ఇప్పటికీ కారు ఉండడం గమనార్హం. పోలీసులు ఆ కారును తరలించలేదు. సుమారు యాభై అడుగుల దూరంలో కారు అద్దాలు పడివున్నట్లు గమనించారు. మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు వందలకు పైగా న్యాయ వాదులు ర్యాలీలో పాల్గొని, పోలీస్ స్టేషన్ మీదుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కు చేరుకుంది. అనంతరం గుంజపడుగు గ్రామానికి చేరుకుని వామన రావు తల్లిదండ్రులని పరామర్శించారు. పోలీసులు తన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటీవరకూ ఎఫ్ ఐ ఆర్ తనకు ఇవ్వలేదని ఆయన తెలిపారు. పుట్ట మధు పేరును కేసులో నమోదు చేయక పోవడం విచారకరమని  అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు బి.కొండారెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయ వాది రఘునందన్, నాంపల్లి కోర్టు న్యాయ వాదులు ఇబ్రహీం, జగన్, మహిళా న్యాయ వాదులు సంపూర్ణ, బబిత పవార్, రేణుక యాదవ్, ఆనంతుల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైద్రాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: