మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో..

దేశ ఐక్యతకు పునరంకితం కావాలి

మౌలానా వర్ధంతి సభలో వక్తలు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్వాతంత్య్ర సమరయోధులు, దేశ ప్రధమ విద్యాశాఖ మంత్రి, భారత రత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 64వ వర్ధంతి స్ధానిక పట్టణ కార్యాలయంలో నిర్వహించి ఘనంగా నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహనరావు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో మోహనరావు, జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఉపాధ్యక్షులు అబ్దుల్ సమద్ పాల్గొని పూలమాల వేసి మౌలాన 'అమర్ రహే' 'జోహారు అంటు నినాదాలు చేశారు. అనంతరం సమద్ మాట్లాడుతూ మౌలానాను స్మరిస్తూ ఆయన వర్ధంతి నిర్వహించడం ఆయన పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. స్వాతంత్య్రం పోరాటంలో దశబ్దిగా జైలులో గడిపారని, ఆయన భార్య కడచూపుకు కూడ నోచుకోలేదన్నారు. అతి పిన్న వయసులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారని, దేశ విభజనను ఖండించారని, ప్రధమ జాతీయ విద్యా శాఖ మంత్రిగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేశారన్నారు. సమద్ మాట్లాడుతూ అలనాడు ఆయన ప్రవేశ పెట్టిన యూజీసీ, ఐఐటి లాంటి సంస్ధలు నేటి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని వాపోయారు.
మాట్లాడుతున్న జానోజాగో సంఘం 
జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా


మాట్లాడుతున్న పీసీసీ
 ప్రధాన కార్యదర్శి చింతల మోహనరావు
ఆయనకు మరణానంతరం భారత రత్న ప్రకటించారని ఆయన చరిత్ర యువతకు ఆదర్శమని కొనియాడారు. చింతల మోహనరావు మాట్లాడుతూ మౌలానాలాంటి యోధులు స్వాతంత్య్ర పోరాటంలో ఉండి కాంగ్రెస్ పార్టీగా పోరాడి, ఎందరో దేశం కోసం ప్రాణాలు కోల్పోయారని, నేడు అందరు దేశభక్తి వల్లె వేస్తున్నారని, నిజమైన దేశ ప్రేమికులు గుర్తించాలన్నారు. జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పఠాన్ మస్తాన్ ఖాన్, జమాత్ కార్యకర్తలు ఫయాజ్, నవాజ్ ఖాన్,  కాంగ్రెస్ కౌన్సిల్ పోటీదారులు రఫీ, బాలకృష్ణ, మగ్బూల్ పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: