'రైతు పోరు'

___పొలాలన్ని హలదండలై,

జన సముద్రాలై ఉరికి వస్తున్నాయి.

విత్తనాలు విచ్చుకొని

చెట్లు అవుతున్నాయి.

చెట్లు అడవులై....

దిక్కార స్వరాలై....

ఉప్పెనలై....

మరో ప్రపంచాన్ని సూచిస్తున్నాయి.

ఇది జనహోరు....

ఇది రణహోరు....

పల్లెలు కదులుతున్నాయి.

నగరాలు,

మహానగరాలు కదులుతున్నాయి.

ఢిల్లీ శివారుల్లో

ఊర్లకు ఊర్లు వెలుస్తున్నాయి.

గ్రామాలు చైతన్యమై

ఫాసిస్టు మూకలకు సమాధానం చెబుతున్నాయి.

పొలాలు దున్నే ట్రాక్టర్లు

పాలకుల గుండెలపై కవాతులు చేస్తున్నాయి.

చిద్రమైన ఈ దేశపు దేహం

నెత్తుటి గాయాలతో

రేపటి నవ చరిత్రను నిర్మిస్తోంది.

ఇంక్విలాబ్ జిందాబాద్..

✍️-షేక్. కరీముల్లా

చిలకలూరి పేట 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: