చీఫ్ జస్టీస్ ను కలిసిన బార్ కౌన్సిల్ సభ్యులు

గట్టు వామన రావు దంపతుల హత్య కేసు విచారణ చేపట్టాలని వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయ వాది గట్టు వామన రావు దంపతుల హత్య పట్ల కేసు విచారణ చేపట్టాలని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చీఫ్ జస్టీస్ కోహ్లీ నీ గురువారం సాయంత్రం కలిసి వినతి పత్రం సమర్పించారు. న్యాయ శాఖ వ్యవస్థపై నమ్మకాన్ని,విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగ పడుతుంది అని అందులో పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ విధించాలని, మరో సంఘటన జరగకుండా  కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అతి కిరాతకంగా వారిని హత్య చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్ రావు, అనంతసేన రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జావిద్ తదితరులు పాల్గొన్నారు. 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్.హైద్రాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: