బ్రహ్మానందీశ్వర దేవాలయంలో...

నవగ్రహ మండపం నిర్మాణం వాయిదా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని శ్రీ బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ మండపం నిర్మాణం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈఓ వేణునాధ రెడ్డి తెలిపారు. దేవాలయంలో శుక్రవారం సాయంత్రం దేవాలయం ఛైర్మెన్ వేణుగోపాల్, కమిటీ సభ్యుల సమక్షంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ దేవాలయంలో ప్రస్తుతం గర్భగుడిలో ఉన్న నవగ్రహాల చుట్టూ భక్తులు తిరిగేందుకు ఇబ్బందిగా ఉండటం, దేవునికి సమర్పించే నూనె క్రిందపడి గతంలో భక్తులు ఇబ్బందులు పడ్డారన్నారు. కమిటీ సభ్యులు, భక్తులు, దాతల సహకారంతో వాస్తు రీత్యా నవగ్రహ మండపాన్ని ఈశాన్యములలో ఏర్పాటు చేయాలని శంకుస్థాపన చేసామన్నారు. వేదపండితులు, భక్తులు, దాతల విన్నపం మేరకు నవగ్రహ మండపం నిర్మాణం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. నవగ్రహ మండపం నిర్మాణం పెద్దలు, ప్రజలు, మీడియా సమక్షంలో త్వరలో సమావేశం ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: