తుదివిడత లోనూ వైసీపీకి ....

అత్యధిక సర్పంచ్ స్థానాలు ఇవ్వండి

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామ చంద్రారెడ్డి అభ్యర్ధన

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

ఏపీలో తుది(నాల్గవ)విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ సందర్బంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసులకు అభివృద్ధిని పరిచయం చేసిన వైసీపీకె ఓటు వేయాలని వైసీపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభ్యర్ధించారు. అలాగే వైసీపీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని.. అటువంటిది జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తోన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకా ఇంకా బలపరచాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. అన్ని జిల్లాల లాగా కాకుండా ప్రకాశం జిల్లాపై  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని.. సంక్షేమ పధకాలే కాకుండా దొనకొండ కేంద్రంగా పరిశ్రమలు, అలాగే సాగు,త్రాగు నీటికోసం ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు. సీఎం జగన్ చొరవ వల్లే వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నిర్మాణం పూర్తయిందని.. ఈ విషయంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ కృషి ప్రశంసనీయమన్నారు ఏలూరి.

జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల కృషిని ప్రజలు గుర్తించాలని కోరారు.. నాల్గవ విడత పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి అఖండ మెజారిటీతో సర్పంచ్ పదవులు ఇచ్చి ఆశీర్వదించాలని అభ్యర్ధించారు. టీడీపీ మునిగిపోతున్న నావ కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు.. అలాగే బీజేపీ, జనసేన తోడు దొంగలుగా మారి రాష్ట్ర ప్రజల్ని కన్ఫుజన్ లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాయని గుర్తుచేశారు. ఇక గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తప్ప జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదని రామచంద్రారెడ్డి. తూర్పు ప్రకాశం జిల్లా రైతుల కోసం గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టిస్తే.. పశ్చిమ ప్రకాశం ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టును ఇచ్చారని గుర్తుచేశారు.. నాడు వైఎస్ చేసిన సేవలు, నేడు సీఎం జగన్ చొరవ కారణంగా వెలిగొండ పూర్తిఅయ్యే దశలో ఉందని అన్నారు.. అందువల్ల నాల్గవ విడత పంచాయితీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సర్పంచ్ స్థానాలు ఇవ్వాలని కోరారు ఏలూరి.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: