ఎన్నికల్లో ప్రచారం చేయకుండా వాలంటీర్లను నియంత్రించాలి

ఎలక్షన్ మేనేజర్  శ్రీనివాసరావుకు ఎస్డీపీఐ నాయకులు వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

వాలెంటర్ల్లు ఓటర్లకు ప్రచారం చేసే విధంగా జరిగే కార్యకలాపాలను నియంత్రించాలని కోరుతూ నంద్యాల ఎలక్షన్ మేనేజర్  శ్రీనివాసరావుకు ఎస్డీపీఐ  నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఎస్డీపీఐI అసెంబ్లీ ప్రెసిడెంట్ ఈక్బాల్ బాషా మాట్లాడుతూ  నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎలక్షన్ల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని, కావున  ఎన్నికలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నియమించిన వార్డు వాలెంటర్ల్లు ఓటర్లకు ప్రచారం చేసే విధంగా జరిగే కార్యకలాపాలను నియంత్రించాలని, ఎన్నికల అధికారి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ అసెంబ్లీ కార్యదర్శి అబు బకర్, అసెంబ్లీ కమిటీ సభ్యులు మజీద్ ఖాన్, కరిముల్ల,సర్దార్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: