బైక్ పై వచ్చే బాలుడిని కాపాడబోయి

అదుపు తప్పిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు వాహనం

అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడి మృతి

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

టీవీఎస్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓబాలుడిని ప్రమాదంనుంచి తప్పించే క్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు  చెందిన వాహనం యాక్సిడెంట్ గురైంది. ఈ ఘటనలో అన్నా రాంబాబు వాహనంలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు తెలిస్తోంది. గుంటూరు జిల్లా నడిగడ్డ జంక్షన్ దగ్గర గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కి చెందిన వాహనం, టీవీఎస్ బైక్ పై వస్తున్న బాలుడుని తప్పించబోయి చెట్టుకు ఢీ కొనడం తో అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడు మార్కాపురం కు చెందిన బోర్ వెల్ పాండు అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: