విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా స్థానిక మద్దూర్ నగర్ లొని ఎక్సెల్ అకాడమీ కళాశాలలో బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్ కు, నంద్యాల పార్లమెంట్  కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు & విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపకులు జె లక్ష్మీ నరసింహా  యాదవ్ కు ఎంబీబీఎస్ సీట్ల భర్తీని రాజ్యాంగబద్ధంగా భర్తీ చేయాలనే రిజర్వేషన్ల తూట్లు పొడుస్తూ రిజర్వేషన్ విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని పోరాటం మొదలు పెట్టి గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమం చేసి విజయం సాధించిన లక్ష్మి నరసింహ యాదవ్ కు జీవో  అమలు చేసినటువంటి  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ  శ్యామ్ ప్రసాద్ లకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి భరత్ కుమార్  ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా వీసీ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇష్టంతో ఉన్నత విద్యలో చదవాలని ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని  తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల భర్తీని కూడా రాజ్యాంగబద్ధంగా భర్తీ చేస్తున్నామని తెలిపారు. సమయం వృథా చేయకుండా చదువు మీద దృష్టి పెట్టి ఎంబీబీఎస్ లొ సీటు  పొందాలని తెలిపారు. అనంతరం విద్యార్థి సమైక్య వ్యవస్థాపకులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం  వారి ఉన్నత విద్యకు ఆర్థికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఎన్నో రూపాలలో పోరాటం చేస్తూ పోలీసుల లాఠీలకు, కేసులను లెక్కచేయకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పోరాడి సాధించామని తెలిపారు. అధైర్యపడకుండా ఎంసెట్లో సీటు పొందిన ప్రతి విద్యార్థి ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండా ఎంబీబీఎస్ కానీ ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చదువుకోవచ్చని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విద్యార్థులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చదువు కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పలుకుతానని తెలిపారు. మీ ఉన్నత విద్య చదువు కోసం ఎన్ని పోరాటాలు అయినా చేస్తానని తెలిపారు. ఎటువంటి ఆంక్షలు,  షరతులు లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు, ఫీజు రీయంబర్స్మెంట్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం వీసీ శ్యాం ప్రసాద్, జె లక్ష్మీ నరసింహ యాదవ్ లకు  పూలమాల, శాలువతో ఘనంగా  సత్కరించారు. ఈ కార్యక్రమంలో కులాల ఐక్య వేదిక అధ్యక్షులు, విద్యార్థి సమాఖ్య నాయకులు హేమసుందరరెడ్డి, రాజేష్, గౌస్,  లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: