పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను..

తక్షణమే ఉపసంహరించుకోవాలి

 ఆవాజ్, కాంగ్రెస్, పిడిఎస్ యూ, ఏఐటీయూసీ, పివైఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిది) 

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని నంద్యాల పట్టణంలో గ్యాస్ సిలిండర్ మోటార్ బైక్ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, కాంగ్రెస్ జిల్లా కోశాధికారి ఎస్.వైడీ.ప్రసాద్, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ఏఐటియుసి జిల్లా నాయకులు మహమ్మద్, పీ వై ఎల్ జిల్లా నాయకులు యూ.నవీన్ కుమార్ మాట్లాడుతూ
సబ్సిడీ సిలిండర్ ధర 30 రూపాయలు సబ్సిడీ లేని సిలిండర్ ధర 150 రూపాయలు పెంచడం వల్ల ప్రతి ఇంటిలో ఉన్న వారు టీ కొట్టు వారు టిఫిన్ సెంటర్ వారు హోటల్ వారు అదనంగా ప్రజలపై భారం అలాగనే వంట పెట్రోల్ డీజిల్ రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య మానవుడు జీవించలేని పరిస్థితి ఉందని బీజేపీ ప్రధానమంత్రి ఇదేనా దేశంలో ఉన్న బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ప్రధానులు ముఖ్యమంత్రులు బీసీల అవుతారా ఓసీ అవుతారా ముఖ్యం కాదని ప్రజా సంక్షేమం కోసం ప్రజలు కడుపు నింపే ఆలోచన చేసే వాళ్లు కావాలని ప్రజల కడుపులు కొట్టి కార్పొరేట్ల నింపేవారు కాకూడదని వారు అన్నారు అలాగే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే ప్రధాని మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో శేషులు పెంచి ప్రజలపై భారం పడదని మరుసటి రోజే వంటగ్యాస్ వంటనూనెలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడమో మోడీ మోసపూరిత విధానాలకు నిదర్శనమని మస్తాన్వలి ఎస్.వై.డీ.ప్రసాద్, ఎస్ ఎన్ డి రఫీ మహమ్మద్ నవీన్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోడీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ,బాషా,రవి,వెంకటేష్, సుబ్బయ్య ఎల్లయ్య పుల్లయ్య, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: