మైత్రి సంఘాలతో సమావేశాలలో భాగంగా

ఖమ్మం నగర మహిళా పోలీస్ స్టేషన్ ను సందర్శించిన..

జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం బృందం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి) 

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం తమ సభ్యులతో కలిసి మహిళా పోలీస్ స్టేషన్ ను సందర్శించి, సి.ఐ. సర్వయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సి.ఐ. సర్వయ్య ఎం.పి.జె సభ్యులతో శాంతియుత సమావేశం నిర్వహించారు. పాల్గొన్న సభ్యులకు అనేక విషయాలపై అవగాహన కల్పించారు. సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక ధృక్పధం తో పని చేయాలని సూచించారు. హిందూ ముస్లిం లు అన్నదమ్ముల వలే మెలగాలని, పేదలకు సత్వర న్యాయం జరగాలని అభిలషించారు. సమస్యల పరిష్కారానికై తమ వంతు కృషి ఎల్లప్పుడూ వుంటుందని ఈ సందర్బ్గంగా  హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎం.పి.జె నాయకులు స్టేషన్ పరిశుభ్రతపై ఎంతో సంతృప్తి ప్రకటించి, సి.ఐ. సర్వయ్యని అబినందించారు.
  స్టేషన్ ఆవరణలో నాటిన పూల మొక్కలు ఆహ్లాద కరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట సామగ్రిని చూస్తే, విడిపోవాలని గొడవపడి పరిష్కారానికై స్టేషన్ కొచ్చే తల్లిదండ్రులకు కనువిప్పు కలుగ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. స్టేషన్ బయట ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు నగర ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఏది ఎమైనా భిన్నంగా ఆలోచించిన సి.ఐ. సర్వయ్య , మహిళా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరం మార్చివేసి, తద్వార పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికీ మంచి ఆలోచనలు కలిగే విధంగా, మాటలతో కాక చేతలలో నిరూపిస్తున్నారు. అదేవిధంగా సి.ఐ. గారు జె.ఐ.హెచ్ మరియు ఎం.పి.జె చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. ఉస్మాన్ అలీ, జె.ఐ.హెచ్ జిల్లా అర్బన్ అధ్యక్షులు ఎస్.కె.అబ్రార్, ఎం.పి.జె జిల్లా నాయకులు ఎస్.కే.ఖాసీం, నాసర్, జహీర్, హకీం, సతీష్, అజీజ్, సుజా, రజబాలి, రఫి, ఖాజా, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.  

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: