శాంతిరామ్ సంగీత నృత్య అకాడమీ..

ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు తమ వంతుగా నాట్యాచార్యులు నరసింహులు తన శిష్య బృందంచే మున్సిపల్ టౌన్ హాల్ నందు సీతారామ కళ్యాణం నృత్య ప్రదర్శన, శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ శాంతి రాముడు, విశిష్ట అతిథులుగా డాక్టర్ రామకృష్ణా రెడ్డి, డాక్టర్ ఉదయ శంకర్, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు,  దామోదర్ రెడ్డి యోగా గురువులు, వంశీ, డాక్టర్ లక్ష్మయ్య, వినోద్, నాట్యాచార్యులు రమణయ్యలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి డాక్టర్ శాంతి రాముడు మాట్లాడుతూ సుమారు 500 సంవత్సరముల మన భారతీయుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం మన చేతుల మీదుగా ఈ తరంలో ఆలయ నిర్మాణం కొరకు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించి రామాలయ నిర్మాణానికి సమర్పించడం చాలా విశేషమైన కార్యక్రమన్నారు. రామకృష్ణరెడ్డి మాట్లాడుతూ నరసింహులు తమ శిష్య బృందంచే వంశీ సహకారంతో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి రామమందిర నిర్మాణంలో తమ వంతుగా చేయడం అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావులు  చిన్నారులచే ఇంత గొప్ప ప్రదర్శన చేయడం రామ మందిర నిర్మాణానికి చేయటం ఆలాగే తిలకించడానికి వచ్చిన నంద్యాల ప్రజల అదృష్టంగా భావించాలని తెలిపారు. నృత్య ప్రదర్శన చేసిన నాట్య కళాకారులకు  అతిథుల ద్వారా బహుమతి ప్రధానోత్సవం జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం మంగళ హారతి తరువాత ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారిచే సేకరించిన విరాళాలు అక్కడే లెక్కించి మొత్తంగా వచ్చిన 65 వేల రూపాయలను డాక్టర్ శాంతి రాముడు చేతుల మీదుగా డాక్టర్ ఉదయ శంకర్ కు రామమందిర నిర్మాణం కొరకు అప్పగించడం జరిగినది.


 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: