కన్న తండ్రికి పదేళ్లు జైలు శిక్ష 

పోక్సో కోర్టు మహిళా జడ్జీ మైత్రేయి తీర్పు వెల్లడి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

సంగారెడ్డి పొక్సో కోర్టు మహిళా జడ్జీ మైత్రేయి సంచలన తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 22 వ తేదీన 2016 సంవత్సరం లో కన్న తండ్రి కసాయిగా మారిన వైనం. తన ఏడేళ్ల కూతురిపై అత్యాచారం చేశాడు. వికారాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు అప్పట్లో కొండాపూర్ ఎస్సై బాలస్వామి కేసు నమోదు చేశారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపిఆర్ వో సృజన కేసు విచారణ కు సంభందించిన వివరాలను వెల్లడించారు. కేసు విచారణ పూర్తయిన అనంతరం గురువారం పదేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ తరఫున కొనసాగిన సాక్షుల వాంగ్మూలం ప్రకారం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 

✍️రిపోర్టింగ్-డి. అనంత రఘు

అడ్వకేట్....హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: