పత్తికొండలో వైసీపీదే హవా

తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకొన్న ఫ్యాను పార్టీ

ఒక్కస్థానంలో వైసీపీ రెబల్ గెలుపు

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తన హవాను చాటుకొంది. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. టీడీపీ మూడు చోట్ల, వైసీపీ రెబల్ ఒక్కచోట విజయం సాధించారు. వివరాలలోకి వెళ్లితే.. పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచు గా వైస్సార్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి, యమ్ యల్ ఏ తనయుడు రామ్ మోహన్ రెడ్డి  కేడీ సి సి మాజీ చైర్మెన్ ఎస్. రామచంద్ర రెడ్డి మాజీ సర్పంచ్ నాగ రత్నమ్మ సహ కారము తో కొమ్ము దీపి క 5765 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వైస్సార్ అబ్యర్థులు పత్తికొండ మండలం చక్కరాళ్ల లో వైస్సార్ అభ్యర్ధి పూరి శ్రీరాములు గెలిచారు.

బుగ్గతండా లో  వైయస్సార్ రెబల్ అభ్యర్థి రంగ నాయక్ 182 ఓట్లతో గెలుపొందారు.

పత్తికొండ మండలం పుచ్చకాయమాడలో టీడీపీ  అభ్యర్థి  కుక్కల హరిత 1100ఓట్లతో గెలుపొందారు.

 పత్తికొండ మండలం వైఎస్ఆర్ పార్టీ మద్దతు దారు పెండ్లి మాను తండా ఎస్. లక్ష్మ నాయక్ గెలుపు

పత్తికొండ మండలం మండగిరి లో వైస్సార్ పార్టీ మద్దతు దారు ప్రభాకర్ రెడ్డి గెలుపు

 పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో లో వైస్సార్సీపీ అభ్యర్థి కురువ.ఆంజినెయ్య గెలుపు,.

పత్తికొండ మండలం చిన్నహుల్తీ లో వైస్సార్ పార్టీ మద్దతు దారు కేశవరెడ్డి 10 ఓట్లు తో గెలుపు.

 పత్తికొండ మండలం దేవనబండ లో వైఎస్ఆర్ పార్టీ మద్దతు దారు 500 ఓట్లు తో గెలుపు.

 పత్తికొండ మండలం ఛందోలి లో టీడీపీ పార్టీ మద్దతు దారు రామిరెడ్డి 5ఓట్లు తో గెలుపు.

పత్తికొండ మండలం పంది కోన గ్రామంలో లో టీడీపీ పార్టీ మద్దతు దారు గెలుపు.

 పత్తికొండ మండలం పెద్దహుల్తీ లో వైస్సార్ పార్టీ  అభ్యర్థి 100 ఓట్లు తో  గెలుపు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: