నాలుగో విడత ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికతో పటిష్ట భద్రత

కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఐపియస్

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఐపియస్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నాలుగో విడత ఎన్నికలకు పకడ్బందీ ప్రణాళికతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, ఐపియస్ తెలిపారు. శనివారం  ఎమ్మిగనూరులోని స్ధానిక  బాబు  ఫంక్షన్ హాల్ లో ఎన్నికల బందోబస్తుకు విధులకు హాజరైన  పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు సమావేశం నిర్వహించి  దిశా, నిర్దేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.2 వేల 8 వందల మంది పోలీసులతో బారీ బందోబస్తు, పకడ్బందీ భద్రత చేపట్టామన్నారు.104 పోలీసు రూట్ మొబైల్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు , అదనంగా ఎపిఎస్పీ బలగాలను కేటాయించామని, జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది ట్రబుల్ మాంగర్స్ ను ముందుగానే గుర్తించి బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల విధులలో అందరూ అంకిత భావంతో పని చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది వరకే జరిగిన 3 విడతల గ్రామ పంచాయితీ ఎన్నికలు జిల్లాలో  ప్రశాంతంగా ముగిశాయన్నారు. 4వ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవిధంగా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి బ్రీఫింగ్ అనేది చాలా ముఖ్యమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద  విధులు నిర్వర్తించే  పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, పోలీసు రూట్ మొబైల్స్ లలో  పని చేసే పోలీసు అధికారులు బాగా  పని చేయాలన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేటాయించిన పోలీంగ్ కేంద్రాలలో పోటీ చేసే అభ్యర్ధులకు తగినవిధంగా పోలీసు అధికారులు ముందస్తుగా భ్రీఫింగ్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద, చుట్టుపక్కల ప్రజలను గుమిగూడడానికి అనుమతించకుండా గట్టి  చర్యలు  తీసుకోవాలన్నారు.గెలిచినా, ఓడినా  సమానంగా తీసుకోవాలని తెలియజేయాలన్నారు. గెలిచిన అభ్యర్దులు ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలు చేయకుండా నిషేధించాలన్నారు. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు అసెంబ్లీలలో 4 వ విడత గ్రామపంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

సమస్యాత్మక, అతి సామస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసుబలగాలను ఏర్పాటు చేశామన్నారు. 4 వ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గట్టి చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల బందోబస్తులో 4 గురు అడిషనల్ ఎస్పీలు,18 మంది డిఎస్పీలు, 35  మంది సిఐలతో సహా మొత్తం 2,800 మంది పోలీసు అధికారులు ఈ బందోబస్తు విధులలో పాల్గొంటారన్నారు. ఆదివారం 265 పంచాయితీలకు,  2,177 వార్డులకు 4 వ విడత ఎన్నికలు జరుగుతాయన్నారు. 104 రూట్ మొబైల్స్, 14 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు , అదనంగా ఎపిఎస్పీ బలగాలను కూడా కేటాయించామన్నారు.


జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది ట్రబుల్ మాంగర్స్ ను ముందుగానే గుర్తించి బైండోవర్ చేశామన్నారు. ఈ సమావేశంలో SEB అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్, ఎపిఎస్పీ కమాండెంట్ పి. రవిశంకర్,  అదనపు ఎస్పీ అడ్మిన్ మధుసుధన రావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణ,  డిఎస్పలు వినోద్ కుమార్, మహేశ్వరరెడ్డి, రమణ, నరసింహా రెడ్డి, వెంకట్రామయ్య, చిదానంద రెడ్డి, రాజేంద్ర,  మహబూబ్ భాషా, యుగంధర్ బాబు, శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి, వై. రవీంద్రా రెడి, శ్రీనివాసులు, అసిస్టెంట్ కమాండ్ అశోక్ కుమార్ రెడ్డి,  ఎమ్మిగనూరురూరల్ సిఐ మంజునాథ్, ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాస్ నాయక్, ఇతర సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: