ఎన్నికల బరిలో వున్న అభ్యర్థులు...

వారి ఖర్చులను రిజిస్టర్ లో పొందపరచాలి

జిల్లా ఎన్నికల వ్యయపరిశిలకుడు   వినీత్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

గ్రామపంచాయతీ ఎన్నికలు 2021ఎన్నికల బరిలో వున్న అభ్యర్థులు వారి ఖర్చులను రిజిస్టర్ లో పొందపరచాలని జిల్లా ఎన్నికల వ్యయపరిశిలకుడు వినీత్ కుమార్ అన్నారు. శనివారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 20 21 అసిస్టెంట్ ఎక్సపెండెచర్ అధికారులకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు వినిత్ కుమార్, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రామాంజనేయులు,  నంద్యాల డిఎల్డిఓ భాస్కర్ లతో కలిసి  సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు వినీత్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు నంద్యాల రెవెన్యూ డివిజన్లో 17 మండలాల్లోని ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారులకు సమీక్ష నిర్వహించామన్నారు.
పదివేల జనాభా కలిగిన ప్రాంతంలో సర్పంచిగా పోటీ చేయు అభ్యర్థులు 2 లక్షల 50 వేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదని, 10 వేల లోపు జనాభా కలిగిన ప్రాంతంలో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులు ఒక లక్షా 50 వేల రూపాయల లోపు ఖర్చు చేయవలసి ఉంటుందన్నారు. పదివేల జనాభా ఉన్న ప్రాంతాలలో వార్డ్ మెంబర్ గా పోటీ చేసేవారు 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చునని, పదివేల జనాభా కంటే తక్కువ ఉంటే 30 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుందన్నారు. ప్రతి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అధికారి  పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఖర్చులను రిజిస్టర్ నందు నమోదయ్యేలా చూడాలన్నారు. అనంతరం నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలోని రిజిస్టర్లను కూడా తనిఖీ చేయడం జరిగిందన్నారు. రిజిస్టర్ లన్నియు సంతృప్తికరంగా ఉన్నదని ఆయన అన్నారు. అనంతరం నంద్యాల మండలంలోని కానాల, పాండురంగాపురం గ్రామంలోని అభ్యర్థులతో మాట్లాడి తగిన సూచనలు ఇచ్చామన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: