మజ్లిస్ నిజస్వరూపం బయటపడింది

జి.నిరంజన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మేయర్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ కు మద్దతుతో మజ్లిస్ నిజస్వరూపం బయటపడిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఇలావుంది...కేంద్రములో బి.జె.పి కి కీలక అంశాలలో మద్దతిస్తున్న టి.అర్.ఎస్ కు ఓటెయ్యడములోని మతలబు ఏమిటి..? ఎన్.టి.అర్ మరియు పి.వి. నరసింహారావు స్మారకాల పై అక్బరుద్దిన్ వ్యాఖ్యలను ఖండిస్తూ పిచ్చివాడు అని చేసిన వ్యాఖ్యలు మరిచి కె.టి.అర్ పిచ్చి వాడి మద్దతెలా తీసుకున్నారు. తాము కూడా పోటీ చేస్తామని సంకేతాలు ఇచ్చి వెనకకు తగ్గడము వెనుక జరిగిన బేరసారలేమిటి ..? బిజెపి మెప్పు కోసం టి.అర్.ఎస్ , మజ్లిస్ లు మైనార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీలకు ఇచ్ఛే ఆనవాయితిని తుంగలో తొక్కారు. మైనార్టీల శ్రేయస్సే మా లక్ష్యమని గొంతు చించుకునే మజ్లిస్ ఎందుకు ఈ అంశాన్ని విస్మరించింది. అని ఆయన ప్రశ్నించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: