ఉచితంగా వినికిడి పరీక్షలు

ఐఐసీడీ పాఠశాలలో ఆడియోలజీ విభాగాన్ని ప్రారంభించిన

జమాఅతె ఇస్లామీహింద్ టీ.ఎస్.రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పుట్టుకతోనే వినికిడిలోపాన్ని గుర్తిస్తే తగిన వైద్యమందించి వినికిడిలోపాన్ని దూరం చేయవచ్చని గాంధీ హాస్పిటల్ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ ఖబీర్ సిద్దీఖీ అన్నారు. పిల్లల్లో వినికిడి లోపాన్ని అశ్రద్ధ చేస్తే పెరిగే కొద్దీ చెవిటితనానికి దారితీసే ప్రమాదముందని డాక్టర్ ఖబీర్ అన్నారు. ఆదివారం ఐడియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ డిజేబుల్డ్ (ఐఐసీడీ) స్కూల్లో ఆడియాలజీ డిపార్టుమెంటు ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినికిడి లోపాలకు పలుకారణాలున్నాయని, భారీ శబ్దాల కారణంగా చెవుల్లో వినికిడి పొర దెబ్బతినే ముప్పు ఎక్కువని ఆయన అన్నారు. దీర్షకాలంగా భారీ శబ్దాలు విన్నప్పుడు లోపలి చెవుల్లో సూక్ష్మకేశాలు క్రమంగా దెబ్బతింటాయని ఆయన అన్నారు. వినికిడి లోపం తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని ఆయన సూచించారు. 

ఉచితంగా వినికిడి పరీక్షలు..

అంతకుముందు ఐఐసీడీ పాఠశాలలో ఆడియాలజీ విభాగాన్ని, చిన్న పిల్లల ఫిజియోథెరఫీ కేంద్రాన్ని జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హామిద్ ముహమ్మద్ ఖాన్, హైదరాబాద్ జిల్లా వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. తమ పాఠశాలలో నిరుపేద పిల్లలకు ఉచితంగా వినికిడి పరీక్షలు, మానసికంగా ఎదుగుదలలేని పిల్లలకు ఉచిత ఫిజియోథెరపీ చేయనున్నట్లు ఐఐసీడీ వైస్ ఛైర్మన్ ఖలీలుర్రహ్మాన్ తెలిపారు. పుట్టుకతోనే వినికిడి లోపాన్ని గుర్తిస్తే వినికిడి లోపాన్ని అధిగమించవచ్చని ఆయన అన్నారు. అనుభవజ్ఞులైన ఆడియోలజిస్టు పర్యవేక్షణలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తమ సంస్థలో మూగ, చెవిటి, అంధ విద్యార్థులకు ఉచిత బోధన అందిస్తున్నామని, మాట్లాడలేని వారికి సంజ్ఞభాష నేర్పి వారికి తగిన తర్పీదునిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్కూలు ప్రిన్సిపల్ అతీఖుర్రహ్మాన్, స్కూలు యాజమాన్యం గులామ్ మోయిన్, నదీమ్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఓ అంథ విద్యార్థి ఉమర్ ఫారూఖ్ ఖుర్ఆన్ పారాయణంతో ఈ ప్రారంభోత్సవ సభ ప్రారంభమైంది. 

✍️రిపోర్టింగ్-ముహమ్మద్ ముజాహిద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి  

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: