మల్కాజిగిరి కోర్టు భవన నిర్మాణానికి స్థలాన్ని..

పరిశీలించిన జస్టీస్ రాజశేఖర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

మల్కాజిగిరి కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం జస్టీస్ రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి తో పాటు జిల్లా జడ్జ్ రాధారాణి, XVI ఏ డి జె భవానీ చంద్ర పాల్గొన్నారు. మల్కాజిగిరి కోర్టు స్వంత భవన నిర్మాణానికి స్థలాన్ని సందర్శించిన అనంతరం కోర్టు గదుల కొలతలు వివరాల గురించి చర్చించడం జరిగింది. అన్ని వసతులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని జస్టీస్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి సైతం స్థల సేకరణ త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
 

✍️రిపోర్టింగ్-డి.అనంత రఘు

అడ్వకేట్....హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: