విద్యార్థి అబ్దుల్ రజాక్ ను..

విచక్షణ రహితంగా కొట్టిన బనగానపల్లె నెహ్రు స్కూల్ ప్రిన్సుపల్...

ప్రిన్సిపల్ రవితేజ రెడ్డిపై క్రిమినల్ కేసు,నమోదు చేసి,స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్-ఎస్ఎఫ్ఐ, బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య డిమాండ్

అబ్దుల్ రజాక్ ను ఎంఐఓ తో కలిసి పరామర్శించిన  విద్యార్థి సంఘాల నాయకులు


(జానోజాగో వెబ్ న్యూస్-బనగానపల్లె ప్రతినిధి)

విద్యార్థి అబ్దుల్ రజాక్ను విచక్షణ రహితంగా కొట్టిన బనగానపల్లె నెహ్రు స్కూల్ ప్రిన్సిపల్ రవితేజ రెడ్డిపై క్రిమినల్ కేసు,నమోదు చేసి,స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్-ఎస్ఎఫ్ఐ, బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య డిమాండ్ చేశాయి. బనగాన పల్లెకు చెందిన అబ్దుల్ రజాక్ ను అతని నివాసంలో ఎంఇఓ పరామర్శించారు. ఎంఇఓతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి రజాక్ ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నిరంజన్, బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం విద్యార్థి అబ్దుల్ రజాక్ ను విచక్షణ రహితంగా కొట్టిన బనగానపల్లె నెహ్రు స్కూల్ ప్రిన్సుపల్ రవితేజ రెడ్డిపై క్రిమినల్ కేసు,నమోదు చేసి,స్కూల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ
ఎంఇఓకి వినతిపత్రం సమర్పించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నిరంజన్, బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి,యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బనగానపల్లె లో నెహ్రు స్కూల్ లో రోజుకు రోజుకు విద్యార్థులపై వేధింపులు మితిమీరిపోతున్నాయని చిన్న చిన్న కారణాలను అడ్డుపెట్టుకొని కావాలనే నెహ్రు స్కూల్ ప్రిన్సుపల్ ముస్లిం విద్యార్థులను టార్గెట్ చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతున్నదని అందుకు నిదర్శనమే నిన్న నెహ్రు స్కూల్ లో చదువుతున్న 6వ తరగతి విద్యార్థి అబ్దుల్ రజాక్ అనే విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా ఉదయం కొట్టి మళ్ళీ సాయంత్రం తిరిగి తన తండ్రి విద్యార్థిని ఇంటికి తీసుకొని పోవడానికి వచ్చేంత వరకు మతిస్థిమితం లేకుండా పడివున్న అబ్దుల్ రజాక్ ను ఎవరు పట్టించుకోకపోవడం చాలా దారుణమని వారన్నారు.
మాతో వేలకు వేలు అధిక ఫీజులు కట్టించుకుంటు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా పిల్లల్ని ఇలా కొట్టడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వారన్నారు. కావున అబ్దుల్ రజాక్ ను చితకబాదిన నెహ్రు స్కూల్ ప్రిన్సుపల్ రవితేజ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి,వెంటనే అరెస్టు చేసి,,విద్యాశాఖాధికారులు తక్షణమే స్పందించి నెహ్రు స్కూల్ గుర్తింపు ను రద్దు చేయాలని లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని,అప్పటికి చర్యలు తీసుకోకపోతే నెహ్రు స్కూల్ ముందే నిరాహారదీక్షలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు హరికృష్ణ, దళిత సంఘం నాయకుడు రాముడు, ఎంఐఎం నాయకులు అమ్మబ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: