ఇంటి వద్దకే రేషన్...సమర్థవంతంగా నిర్వహించుకుందాం

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుందామని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. శనివారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేషన్ పంపిణీపై డివిజినల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశము నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ,  నంద్యాల తహసీల్దార్ రవికుమార్ లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమం గురించి డివిజన్ స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించామని, ఈ కమిటీకి సబ్ కలెక్టర్ చైర్మన్ గాను,  అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి కన్వీనర్, సభ్యునిగా నంద్యాల తహసిల్దార్ రవి కుమార్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ,  రేషన్ షాప్ డీలర్స్, ముగ్గురు మొబైల్ డిస్పెర్సింగ్ యూనిట్ ఆపరేటర్లు, ముగ్గురు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంపై ఏవైనా  సమస్యలు ఉన్నా సూచనలు ఉన్న వాటిపై సమీక్షించి కమిటీ స్థాయిలో జరిగే సమావేశంలో వాటిని తక్షణమే పరిష్కరిస్తామని లేనియెడల ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ పథకం ప్రవేశ పెట్టినప్పటినుండి ఎండియు ఆపరేటర్లు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ పంపిణీ చేస్తున్నారని కానీ ఆపరేటర్ వాహనం తీసుకువెళ్లి ఈపాస్ మిషన్ ఉపయోగించి పంపిణీ గావించడం ఇబ్బందికరంగా ఉన్నందున వారికి ఒక సహాయకుడిని కూడా ఇవ్వనున్నామని, ఈపాస్ మిషన్లు ఆపరేట్ చేయడం వారికి కష్టంగా ఉన్నందున ప్రస్తుతానికి ఆ వార్డులకు సంబంధించిన వాలంటీర్లను, వీఆర్వోలను సహాయకారులుగా ఉంచుతున్నామని, వీరందరూ సమన్వయంతో వ్యవహరించి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. కొంతమంది రేషన్ డీలర్లు మాట్లాడుతూ కరోన కష్ట కాలాల్లోనూ, వరదల సమయంలోనూ మేము కూడా ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ గావించామని, మమ్ములను కూడా గుర్తించి మాకు కూడా గౌరవ వేతనము కావాలని కోరారు. ఈ విషయాన్ని ఉనాతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఆచారి, సీఎస్ డిటీ ప్రసాద్, ఎండియూ ఆపరేటర్లు, రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: