గెలివి, నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై..

చర్యలు తీసుకోవాలి..తనిఖీలు నిర్వహించాలి

డిఇఓకు ఏఐఎస్ఎఫ్ నేతల వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తూ విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని నంద్యాలకు విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఓ)సాయిరాంను కలిసి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు, ఏఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్ వినతి పత్రం అందజేశారు. స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ,ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ చేస్తున్నారని కావున ఆ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాలకు విచ్చేసిన డిఇఓ సాయిరాంను కలిసి పిర్యాదు చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు ఏఐఎస్ఎఫ్ నంద్యాల డివిజన్ కార్యదర్శి సురేష్ లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలివి స్కూల్ యాజమాన్యం చేస్తున్న ఫీజుల దోపిడిపై,మౌలిక సదుపాయాలలో భాగంగా విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం ఆటస్థలం లేదని,పార్కింగ్ స్థలం లేదని,విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్ కూడా సక్రమంగా లేవని,మరియు గెలివి స్కూల్ రోడ్ పక్కనే ఉన్న కారణంగా ఉదయం విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో,తిరిగి స్కూల్ వదిలే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉన్నదని ఇలా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నదని కావున గెలివి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నంద్యాల ఉపవిద్యాశాఖ అధికారి గారికి ఎన్నో సార్లు పిర్యాదు చేసిన కూడా లాభం లేకుండా పోయిందని వారు తెలిపారు.అంతే కాకుండా అదే ఏరియాలో ఉన్న నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం కూడా 3 అంతస్తుల్లో పాఠశాల నిర్వహిస్తూ పాటించవలసిన ఫైర్ నిబంధనలు పాటించకుండా ఎదో పెట్టాలంటే పెట్టాలి అన్నట్టుగా ఫైర్ పరికరాలు పెట్టారని,అంతే కాకుండా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఎటువంటి ఆటస్థలం కానీ,పార్కింగ్ స్థలం కానీ,సరిపడు టాయిలెట్స్ కానీ లేవని వారు తెలిపారు.మరి ముఖ్యంగా కరోన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు కూడా తగ్గించాలని సూచించిన కూడా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మొత్తం ఫీజులు కట్టాలని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు విన్నవించినా కూడా ఉపవిద్యాశాఖ అధికారి (డిప్యూటీ డీఇఓ) ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమని,ఆ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మాచెప్పులు అరిగిపోయ్యాయి తప్ప ఇంతవరకు ఆ స్కూళ్ల వైపు నంద్యాల డిప్యూటీ.డి.ఈ.ఓ గారు ఒక్కసారి కూడా తొంగి చూడకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిఇఓ సాయిరాం గారికి వివరించారు.కావున తక్షణమే గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లీష్ స్కూళ్లను డిఇఓ సాయిరాం గారు తనిఖీ చేసి చర్యలు తీసుకొని,ఫీజుల వివరాలను ఆయా పాఠశాలల్లో నోటీసు బోర్డుల్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని,ఆ రెండు పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దందాకు అడ్డుకట్ట వేయాలని డిఇఓ సాయిరాంను ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఆ స్కూళ్లపై చర్యలు తీసుకునేంత వరకు దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని వారు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

 👉...రంగం ఏదైనా ప్రత్యేక బాణీతో మీ మనస్సులో ముద్ర వేసుకొన్న మా www.jaanojaago.com వెబ్ సైట్ ను వీక్షిస్తున్నా మా వేలాది మంది వీవర్స్ కు ధన్యవాదాలు. అదే తరహాలో..రాజకీయ విశ్లేషణలు....సమాజ శ్రేయస్సు అంశాలు...సినీమా...రంగం ఏదైనా ప్రత్యేక కథనాల కోసం మా యూట్యూబ్ ఛానల్ jaanojaagotv ని సబ్ స్క్రైబ్ చేయండి..చేయించండి. మా ఛానల్ ను ఆదరించండి....ఆశీర్వదించండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: